కరోనా మహమ్మారి నేపథ్యంలో అందరూ ఇమ్యూనిటీ/రోగనిరోధకశక్తిని పెంచే ఆహార పదార్థాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వివిద కంపెనీలు రోగ నిరోధక శక్తిని పెంచే ఐటమ్స్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి! తాజాగా చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ రోగ నిరోధక శక్తి ఫుడ్ ఐటమ్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనిని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి శుక్రవారం ఆవిష్కరించారు.

అల్లం పాలు, తులసి పాలు, టర్మరిక్ పాలు
హెరిటేజ్ అల్లం.. హెరిటేజ్ తులసి.. హెరిటేజ్ టర్మరిక్.. రకాలతో కూడిన రోగనిరోధకశక్తిని పెంచే పాలను హెరిటేజ్ ఫుడ్స్ ఆవిష్కరించింది. శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరిచేందుకు, గొంతు ఇన్ఫెక్షన్ తగ్గించేందుకు, శరీరంలో జీవక్రియలు సజావుగా సాగి, తద్వారా రోగనిరోధకశక్తి పెరిగేందుకు ఈ పాలు దోహదపడతాయని నారా బ్రాహ్మణి అన్నారు. అన్ని రిటైల్ సేల్స్ పాయింట్స్, ఆన్ లైన్ స్టోర్స్ ద్వారా ఇవి అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. హెరిటేజ్ మొబైల్ యాప్ ద్వారా కూడా దీనిని కొనుగోలు చేయవచ్చు.

ఒక్కో సీసా ధర రూ.30
170 మిల్లీ లీటర్ల ఆకర్షణీయమైన సీసాలలో వీటిని విక్రయిస్తున్నట్లు నారా బ్రాహ్మణి చెప్పారు. ఒక్కో సీసా ధర రూ.30ని నిర్ణయించారు. ఈ పాల లైఫ్ 90 రోజులు. ఈ పాల సీసా బాటిల్స్ హెరిటేజ్ పార్లర్స్‌తో పాటు మోడర్న్ రిటైల్ స్టోర్స్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్, సెలెక్ట్ స్టాండలోన్ స్టోర్స్‌లలో లభ్యమవుతాయి.

TUCH యాప్
హెరిటేజ్ ఫుడ్స్ హెరిటేజ్ టచ్ యాప్‌ను కూడా ప్రారంభించింది. హైదరాబాద్‌లోని వినియోగదారులు పాలు, పాల పదార్థాలను ఈ యాప్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో చాలామంది ఇంటికి పరిమితం అవుతున్నారు. ఇంట్లోనే సురక్షితంగా ఉండి ఆర్డర్ చేయవచ్చు.ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ... ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులను ప్రారంభించినందుకు ఆనందంగా ఉందని, రోగనిరోధకశక్తిని పెంచడంలో ఉపయోగపడుతుందన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలకు కారణమైందన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ ఎప్పుడు కూడా కస్టమర్లకు ఆరోగ్యకరమైన పదార్థాలు అందిస్తుందన్నారు. సరైన సమయంలో వినూత్న ఉత్పత్తులు తీసుకు వస్తున్నామన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకొని, విలువలతో కూడిన ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తీసుకు వస్తోందన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications