For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా-లాక్‌డౌన్ టైంలో భారతీయులు వేటిపై డబ్బులు ఖర్చు చేశారు?

|

కరోనా మహమ్మారి కారణంగా సుదీర్ఘ లాక్ డౌన్ వల్ల వినియోగదారుల అలవాట్లు చాలావరకు మారిపోయాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ, అవసరమైన వస్తువులను భద్రపరుచుకోవడం వంటి వాటిపై ఎంతగా శ్రద్ధ చూపారో ఇటీవలి కాలంలో పెరిగిన ఖర్చు విధానాలు వెల్లడిస్తున్నాయి. వినియోగదారుల్లో వచ్చిన మార్పులు కొన్ని రంగాలు లేదా కంపెనీలకు ఊతమిచ్చాయి. కరోనా-లాక్ డౌన్ సమయంలో వినియోదారుల్లో వచ్చిన మార్పులు, వేటిపై ఖర్చు చేసేందుకు మొగ్గు చూపారో తెలుసుకుందాం..

రూ.20వేల డిస్కౌంట్! ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అదిరిపోయే ఆఫర్స్రూ.20వేల డిస్కౌంట్! ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అదిరిపోయే ఆఫర్స్

ఇమ్యూనిటీ, ఆరోగ్యం..

ఇమ్యూనిటీ, ఆరోగ్యం..

కరోనా విజృంభన నేపథ్యంలో కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించారు. రోగనిరోధకశక్తిని పెంచే ఆహార పదార్థాలు, మెడిసిన్స్ తీసుకున్నారు. మనదేశంలో ఆయుర్వేద మెడిసిన్‌కు ప్రాధాన్యత ఉంటుంది. దీంతో దాబుర్ ఇండియా, హిమాలయ డ్రగ్ కంపెనీలకు చెందిన సంప్రదాయ ఉత్పత్తులు చ్యవన్‌ప్రాష్, సెప్టిలిన్‌కు డిమాండ్ పెరిగింది. జూన్‌లో చ్యవన్‌ప్రాష్ అమ్మకాలు 283 శాతం, బ్రాండెడ్ తేనె 39 శాతం పెరిగాయని నీల్సన్ హోల్డింగ్స్ తెలిపింది.

700 శాతం పెరిగిన చ్యవన్‌ప్రాష్ సేల్స్

700 శాతం పెరిగిన చ్యవన్‌ప్రాష్ సేల్స్

భారత అతిపెద్ద ఆయుర్వేదిక్ ఉత్పత్తుల కంపెనీ దాబూర్ తమ చ్యవన్‌ప్రాష్ సేల్స్ ఏప్రిల్ నుండి జూన్ మధ్య 700 శాతం పెరిగినట్లు తెలిపింది. వినియోగదారుల కొనుగోళ్లలో స్పష్టమైన మార్పు కనిపించిందని, రోగనిరోధక శక్తి పెంచే ఉత్పత్తులు, ఆరోగ్యపరమైన ఉత్పత్తులపై ఎక్కువ ఖర్చు చేయాలని భావిస్తున్నారని నీల్సన్ సౌత్ ఏసియా మార్కెట్‌కు చెందిన సమీర్ శుక్ల అన్నారు. ఏప్రిల్-జూన్ మధ్య సేల్స్ పెరిగినట్లు పతంజలి తెలిపింది.

పెరిగిన ప్యాకేజ్డ్ సేల్స్

పెరిగిన ప్యాకేజ్డ్ సేల్స్

మార్చి నెల నుండి ప్యాకేజ్డ్ ఐటమ్స్ సేల్స్ పెరిగాయి. ఇవి త్వరగా చెడిపోవు. అలాగే అల్పాహార తృణధాన్యాలు, ఇన్‌స్టాండ్ నూడుల్స్ వంటి ఉత్పత్తుల సేల్స్ పెరిగాయి. నెస్ట్లే ఇండియాకు చెందిన మ్యాగీ నూడుల్స్ చాలా ఫేమస్. మార్చితో ముగిసిన క్వార్టర్‌కే ఈ ఆదాయం 10.7 శాతం పెరిగింది. మ్యాగీ, కిట్‌క్యాట్, మంచ్ సేల్స్ పెరుగుదల ఎక్కువగా ఉంది.

పార్లే, బ్రిటానియా సేల్స్ అదుర్స్

పార్లే, బ్రిటానియా సేల్స్ అదుర్స్

భారతీయ కుటుంబాల్లో కలిసిపోయిన మరో ఉత్పత్తి పార్లే ప్రోడక్ట్‌కు చెందిన పార్లేజీ బిస్కట్. ఏప్రిల్-మే నెలల్లో ఇవి రికార్డ్ అమ్మకాలు నమోదు చేశాయి. నీడీపీపుల్‌కు సాయం చేసేందుకు ఎన్జీవోలు సహా సేవ చేయడానికి ముందుకు వచ్చిన వారు కంఫోర్ట్ ఫుడ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. అంటే బిస్కట్లు వంటి వాటిని పంపిణీ చేశారు. బ్రిటానియా సేల్స్ భారీగా పెరిగాయి. ఈ కారణంగా బ్రిటానియా టార్గెట్ ధరను పెంచింది.

వీటి సెల్స్ భారీగా పెరిగాయి

వీటి సెల్స్ భారీగా పెరిగాయి

కరోనా తదనంతర పరిణామాల వల్ల చాలామంది చేతిలో నగదు లేకపోవడం లేదా దాచుకోవడం సహజంగా మారింది. అయితే భరించగలిగే వారు తమకు ఖాళీ దొరికిన సమయంలో జ్యూసర్, మిక్సర్, మైక్రోవేవ్, టోస్టర్ వంటివి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారట. వీటి కోసం సెర్చ్ చేయడం నాలుగు రెట్లు పెరిగినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. వ్యాక్యూమ్ క్లీనర్లకు జూలైలో నాలుగు రెట్ల డిమాండ్ పెరిగింది. లాక్ డౌన్ సమయంలో సెలూన్లు మూసివేశారు. దీంతో ట్రిమ్మర్స్‌కు డిమాండ్ పెరిగిందని హావెల్స్ ఇండియా తెలిపింది. దాదాపు ఈ సేల్స్ ప్రీ-కోవిడ్ సమయంతో పోలిస్తే ఐదు రెట్లు పెరిగాయి. ఫిలిప్స్ ఇండియా ఉత్పత్తులు 60 శాతం నుండి 70 శాతం పెరిగాయి.

English summary

కరోనా-లాక్‌డౌన్ టైంలో భారతీయులు వేటిపై డబ్బులు ఖర్చు చేశారు? | Here's what Indians have been spending their cash on during pandemic

Consumers around the world are showing an increased interest in safeguarding their health and boosting their immunity. In India, that often means ayurveda, the country’s ancient system of medicine.
Story first published: Friday, August 7, 2020, 15:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X