For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HCL Jobs: మహిళలకు HCL ఐటీ ఉద్యోగాల ఆఫర్.. ఫ్లెక్సిబుల్ వర్క్ టైమింగ్స్‌.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

|

HCL Jobs: హెచ్‌సీఎల్ మహిళా ఇంజనీర్‌లకు ఉద్యోగాలను అందిస్తోంది. కొంత కాలం జాబ్ చేసిన తరువాత మానేసి మళ్లీ కెరీర్ తిరిగి ప్రారంభించాలనుకుంటున్న వారికి ఈ అవకాశాన్ని అందిస్తోంది. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, కంపెనీకి అవసరమైన నైపుణ్యాల గురించి ఇప్పుడు తెలుసుకోండి..

 కెరీర్ బ్రేక్ తరువాత..

కెరీర్ బ్రేక్ తరువాత..

దేశంలోని ఐటీ దిగ్గజం హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (HCL) ఏ కారణం చేతనైనా కెరీర్‌లో విరామం తీసుకున్న మహిళలకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇందుకోసం తిరిగి పనిచేయాలని కోరుకుంటున్న మహిళలకు రిటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను రూపొందించింది.

 ఏ పోస్టుల్లో అవకాశాలు ఉన్నాయి..?

ఏ పోస్టుల్లో అవకాశాలు ఉన్నాయి..?

నోయిడాలో ప్రధాన కార్యాలయంలో కంపెనీ డిజిటల్ అప్లికేషన్స్, డేటా ఇంజనీరింగ్, డిజైన్ థింకింగ్ రంగాల్లో స్థానాలను ఉద్యోగాలను ఆఫర్ చేస్తోంది. బిజినెస్ టెక్నాలజీపై ఆసక్తి ఉన్న మహిళలు తమ దరఖాస్తులను పంపాలని కంపెనీ కోరింది.

 ఫ్లెక్సిబుల్ వర్క్ టైమింగ్స్‌..

ఫ్లెక్సిబుల్ వర్క్ టైమింగ్స్‌..

ఎంపికైన మహిళా అభ్యర్థులకు ఫ్లెక్సిబుల్ వర్క్ టైమింగ్స్‌ను అందించనున్నట్లు కంపెనీ ఆఫర్ చేసింది. అంతేకాకుండా.. రిక్రూట్ అయిన వారికి "అత్యాధునిక సాంకేతికతలో ప్రత్యేక శిక్షణ" కెరీర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు అందించబడతాయని స్పష్టం చేసింది.

ఉద్యోగ అర్హతలు..

ఉద్యోగ అర్హతలు..

* బేసిక్ ఫండమెంటల్స్ పై కనీస జ్ఞానంతో పాటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజస్ పై రెండు సంవత్సరాల అనుభవం అవసరం.

* లాజికల్, ఎనలిటికల్ సామర్ధ్యాలు.

* మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, అద్భుతమైన వృత్తి నైపుణ్యాలు.

* ఏదైనా డిజిటల్ టెక్నాలజీలో 'క్రాస్-స్కిల్, అప్‌స్కిల్' చేయడానికి సిద్ధంగా ఉండాలి

* ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సహా ఏదైనా సరిసమానమైన ఫీల్డ్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు

 ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

1. అభ్యర్థి తన ప్రాథమిక సమాచారాన్ని కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.hcltech.com/returnship/register లో అందించాలి.

2. దరఖాస్తు చేస్తున్నప్పుడు అప్‌డేట్ చేసిన రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేయాలి.

3. ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ముందు కంపెనీ పాలసీలను చదవండి.

తిరిగి వచ్చేవారికి ప్రయోజనాలు..

తిరిగి వచ్చేవారికి ప్రయోజనాలు..

* సమగ్ర మౌలిక సదుపాయాలు, కల్చర్.

* ఇప్పటికే ఉన్న నైపుణ్యాలను రిఫ్రెష్ చేసుకోవటంతో పాటు కొత్త వాటిని నేర్చుకోవచ్చు.

* కెరీర్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు.

* గత ఉద్యోగ అనుభవానికి నిర్మాణాత్మక రాబడి.

ఎంపిక ప్రక్రియను త్వరలో అధికారిక సైట్‌లో ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది. వృత్తిపరమైన విశ్రాంతి తీసుకోనివారు సైతం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. అయితే.. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఈ విషయాన్ని తప్పక వెల్లడించాలని కంపెనీ పేర్కొంది.

English summary

HCL Jobs: మహిళలకు HCL ఐటీ ఉద్యోగాల ఆఫర్.. ఫ్లెక్సిబుల్ వర్క్ టైమింగ్స్‌.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.. | HCL technologies offering job openings to women who are willing to join job after career break know full details

HCL offering jobs to women engineers, designers willing to return from career break know how to apply
Story first published: Monday, August 1, 2022, 19:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X