For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెచ్‌సీఎల్ టెక్ ప్రాఫిట్ అదుర్స్, ఏడాదిలో రూ.44 డివిడెండ్

|

దిగ్గజ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ గురువారం (ఏప్రిల్ 21) రోజున నాలుగో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. హెచ్‌సీఎల్ లాభం మూడింతలు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి గాను నికర లాభం (ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్) రూ.3593 కోట్లను ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన ఇది మూడు రెట్లు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.1102 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. 2021 డిసెంబర్ త్రైమాసిక లాభం రూ.3442 కోట్లతో పోల్చినా 4.4 శాతం పెరిగింది. అన్ని విభాగాల్లో మంచి వృద్ధిని నమోదు చేసినట్లు హెచ్‌సీఎల్ తెలిపింది.

బలమైన వృద్ధి

బలమైన వృద్ధి

ఏడాది క్రితంతో పోలిస్తే కన్సాలిడేటెడ్ ఆదాయ వృద్ధి 15 శాతం పెరిగి రూ.22,597 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఇది రూ.19,642 కోట్లుగా ఉంది. అంతకుముందు త్రైమాసికంపరంగా చూసినా రూ.22,331 కోట్లతో 1.2 శాతం పెరిగింది. ఐటీ సేవలు, ఈఆర్డీ (ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) వ్యాపారం ద్వారా ఆదాయం మరింత పెరిగినట్లు తెలిపింది.

ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి అంటే ఏప్రిల్-మార్చి కాలంలో నికర లాభం 21.1 శాతం పెరిగి రూ.13,499గా నమోదయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.11,145 కోట్లుగా ఉంది.

డివిడెండ్.. కొత్త ఖాతాలు

డివిడెండ్.. కొత్త ఖాతాలు

రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరు పైన రూ.18 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నెల 29వ తేదీని రికార్డ్ తేదీగా నిర్ణయించింది. మే 11వ తేదీ వరకు ఈ డివిడెండ్ చెల్లింపు ఉంటుంది. ఏడాదిలో కంపెనీ రూ.44 డివిడెండ్ ఇచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్థిర కరెన్సీలో ఆదాయ వృద్ధి 12 శాతం నుండి 13 శాతం ఉండవచ్చునని కంపెనీ పేర్కొంది. ఎబిడా మార్జిన్ 18 శాతం నుండి 20 శాతంగా ఉండవచ్చునని అంచనా వేసింది. అన్ని విభాగాల్లో కంపెనీకి కొత్త ఖాతాదారులు చేరారు.

100 మిలియన్ డాలర్ల పైబడిన విభాగంలో ఒక ఖాతాదారు, 50 మిలియన్ డాలర్ల పైబడిన విభాగంలో 8 ఖాతాలు, 20 మిలియన్ డాలర్ల పైబడిన విభాగంలో 22 ఖాతాలు, 10 మిలియన్ డాలర్ల పైబడిన విభాగంలో 30 ఖాతాలు, 5 మిలియన్ డాలర్ల పైబడిన విభాగంలో 31 ఖాతాలు, 1 మిలియన్ డాలర్ల పైబడిన విభాగంలో 73 ఖాతాలు జత కలిశాయి.

పెరిగిన ఉద్యోగులు

పెరిగిన ఉద్యోగులు

మార్చి త్రైమాసికం ముగిసే సమయానికి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 2,08,877గా ఉంది. గత త్రైమాసికంలో కంపెనీ అంతర్జాతీయంగా నికరంగా 11 వేలమంది ఉద్యోగులను నియమించుకుంది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉద్యోగుల సంఖ్య 39,900కు చేరుకుంది.

English summary

హెచ్‌సీఎల్ టెక్ ప్రాఫిట్ అదుర్స్, ఏడాదిలో రూ.44 డివిడెండ్ | HCL Tech Q4 Results: Profit more than triples, announces dividend

HCL Technologies Ltd, a top-tier IT services provider in the country, on April 21 reported 226 percent growth in its consolidated profit after tax at Rs 3,593 crore, compared to Rs 1,102 crore reported in the corresponding quarter a year ago.
Story first published: Friday, April 22, 2022, 8:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X