For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియా ఐటీ దిగ్గజం డీడబ్ల్యూఎస్‌ను చేజిక్కించుకున్న హెచ్‌సీఎల్:ఆ రెండు దేశాలే టార్గెట్

|

న్యూఢిల్లీ: దేశీయ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్.. ఆస్ట్రేలియాకు చెందిన అగ్రశ్రేణి ఐటీ, బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ గ్రూప్ డిడబ్ల్యూఎస్‌ను లిమిటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఒక్కో షేరు 1.20 ఆస్ట్రేలియా డాలర్ల చొప్పున మొత్తం 115.8 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో విస్తరణ కోసమే..

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో విస్తరణ కోసమే..

స్కీమ్ ఆఫ్ అరెంజ్‌మెంట్ ప్రక్రియ ద్వారా ఈ కొనుగోలు జరుగుతుందని, దీన్ని ఆస్ట్రేలియాలో కోర్టులు ఆమోదిస్తాయని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది.

డీడబ్ల్యూఎస్ లిమిటెడ్ కొనుగోలు లావాదేవీ ఈ ఏడాది డిసెంబర్‌లో పూర్తవుతుందని ఎక్ఛేంజీలకు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సమాచారం ఇచ్చింది. ఆస్ట్రేలియా ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ రివ్యూ బోర్డు, ఆస్ట్రేలియా కాంపిటీషన్ కమిషన్, న్యూజిలాండ్‌కు చెందిన ఓవర్సీస్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసుల ఆమోదాలకు లోబడి ఈ డీల్ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించింది. ఈ టేకోవర్‌తో ఆస్ట్రేలియాతోపాటు న్యూజిలాండ్‌లోస్ట్రాటజిక్ ఇన్నోవేషన్ భాగస్వామిగా తమ లీడర్‌షిప్ పొజిషన్ మరింత బలోపేతం చేస్తుందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది.

ఆస్ట్రేలియా దిగ్జజ కంపెనీలో ఒకటి డీడబ్ల్యూఎస్..

ఆస్ట్రేలియా దిగ్జజ కంపెనీలో ఒకటి డీడబ్ల్యూఎస్..

డిడబ్ల్యూఎస్ గ్రూప్ 2020 ఆర్థిక సంవత్సరానికి 122.9 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని సముపార్జించింది. మెల్బోర్న్, సిడ్నీ, ఆడిలాయిడ్, బ్రిస్బేన్, కాన్‌బెర్రా నగరాల్లో ఈ కంపెనీకి కార్యాలయాలున్నాయి. మొత్తం 700 మందికిపైగా ఉద్యోగస్తులు విధులు నిర్వహిస్తున్నారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, అప్లికేషన్ డెవలప్‌మెంట్, సపోర్ట్, ప్రోగ్రాం, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, కన్సల్టేంగ్ సేవలను అందిస్తోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ మైకేల్ హార్టన్ మాట్లాడుతూ.. డిబ్ల్యూఎస్ సంస్థను చేజిక్కించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ డీల్ ద్వారా తమ కంపెనీ కార్యకలాపాలను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో మరింత విస్తరిస్తామని చెప్పారు.

హెచ్‌సీఎల్‌తో కలవడం అందరికీ మేలంటూ డీడబ్ల్యూఎస్ ఎండీ

హెచ్‌సీఎల్‌తో కలవడం అందరికీ మేలంటూ డీడబ్ల్యూఎస్ ఎండీ

ఇక హెచ్‌సీఎల్ ప్రస్తుతం కాన్‌బెర్రా, సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్, పెర్త్ లాంటి నగరాల్లో 1600 మంది ఉద్యోగులతో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 2020 డిసెంబర్ నాటికి రెగ్యూలేటర్ అప్రూవల్స్ సహా కార్యకలాపాలను ముగించే అవకాశం ఉంది.

హెచ్‌సీఎల్ కంపెనీతో కలవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని డీడబ్ల్యూఎస్ సీఈవో అండ్ ఎండీ డ్యానీ వాలిస్ తెలిపారు. ఈ డీల్ వల్ల తమ కంపెనీకి చెందిన ఉద్యోగులు, షేర్ హోల్డర్స్, భాగస్వాములకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. కాగా, ఈ కొత్త టేకోవర్ ప్రకటనతో వరుసగా మూడో రోజూ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ల జోరు కొనసాగింది. సోమవారం ఔట్ ఫెర్ఫామ్ చేస్తోన్న ఈ స్టాక్ నిఫ్టీ-50లో టాప్ గెయినర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ షేర్ 4 శాతానికి పైగా లాభంతో రూ. 844కు చేరి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని చేరుకుంది.

English summary

ఆస్ట్రేలియా ఐటీ దిగ్గజం డీడబ్ల్యూఎస్‌ను చేజిక్కించుకున్న హెచ్‌సీఎల్:ఆ రెండు దేశాలే టార్గెట్ | HCL tech acquires Australian IT firm DWS for $115.8 million

HCL Technologies NSE -0.99 % has announced the acquisition of Australian IT firm DWS Ltd for $115.8 million in a bid to further expand its digital offerings especially in Australia and New Zealand.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X