For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సీఈవో హెచ్చరిక: పేటీఎం నుంచి ఈ మెసేజ్ వచ్చిందా? ఐతే జాగ్రత్త

|

బ్యాంకులు, ఈ-వ్యాలెట్ కంపెనీలు తమ తమ వినియోగదారులను, కస్టమర్లను ఎప్పటికప్పుడు ప్రాడ్‌స్టర్స్ నుంచి అప్రమత్తం చేస్తుంటాయి. నకిలీ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తన వినియోగదారుల్ని పేటీఎం హెచ్చరించింది. ఈ మేరకు పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా హెచ్చరిక ట్వీట్ చేశారు.

అందరూ సమానమే: ఉద్యోగుల తొలగింపుకు సంబంధించి మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం!అందరూ సమానమే: ఉద్యోగుల తొలగింపుకు సంబంధించి మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

KYC వివరాలివ్వకుంటే..

KYC వివరాలివ్వకుంటే..

KYC వివరాలు అందించకుంటే అకౌంట్ బ్లాక్ అవుతుందని, సంబంధిత యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలని వినియోగదారులకు సందేశాలు వచ్చాయి. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. KYC స్కాం పైన కస్టమర్లను అప్రమత్తం చేశారు.

వాటి పట్ల జాగ్రత్త

వాటి పట్ల జాగ్రత్త

మీ పేటీఎం అకౌంట్‌కు సంబంధించి KYC వివరాల కోసం ఏదైనా సందేశం వస్తే, అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పేటీఎం ఎలాంటి వివరాలను వినియోగదారుల నుంచి కోరడం లేదని స్పష్టం చేశారు. అలాగే, యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోమని కూడా తాము సూచించలేదని చెబుతున్నారు.

ఇవీ నమ్మవద్దు

అనుమానిత సందేశాలు, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా పెద్ద మొత్తంలో బహుమతులు, లక్కీ ఛాన్స్ అంటూ వచ్చే సందేశాలను కూడా నమ్మవద్దని కోరారు. ఇదో పెద్ద స్కాం అని, దీనిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. KYC, అకౌంట్ బ్లాక్, కాంటెస్ట్ ఫ్రాడ్ ఎస్సెమ్మెస్‌లు, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

English summary

సీఈవో హెచ్చరిక: పేటీఎం నుంచి ఈ మెసేజ్ వచ్చిందా? ఐతే జాగ్రత్త | Have you received this Paytm message? Don't believe it

If you have received a message from Paytm intimating you to complete your KYC, without which the company would "hold" the amount in your account, then beware! Paytm chief Vijay Shekhar Sharma took to Twitter to warn his followers that fake messages are being circulated in the name of the company.
Story first published: Thursday, November 21, 2019, 16:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X