For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేక్ ఎ బోవ్: టెస్లాకు తెలంగాణ రెడ్ కార్పెట్: ఎలాన్ మస్క్‌కు కేటీఆర్ వెల్‌కమ్

|

హైదరాబాద్: భారత్‌లో పెట్టుబడులు పెట్టే విషయంలో కార్పొరేట్ బిగ్ షాట్..అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటోన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే చాలా ఆ దేశ ప్రభుత్వంతో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోందంటూ బాంబు పేల్చారు. వాటిని పరిష్కరించుకోవడానికి రెండు సంవత్సరాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నామని స్పష్టం చేశారు. అయినప్పటికీ- అవి పరిష్కారానికి నోచుకోవట్లేదంటూ చెప్పుకొచ్చారు.

2019 నుంచీ..

2019 నుంచీ..

భారత మార్కెట్‌లో టెస్లా ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావాలనేది తమ ఉద్దేశమని, 2019 నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెట్టామని, రోజులు గడుస్తున్నప్పటికీ.. అది వాస్తవ రూపాన్ని దాల్చలేకపోతోందంటూ కుండబద్దలు కొట్టారు. భారత ప్రభుత్వ అధికారులతో నాలుగేళ్లుగా తాము చర్చలు, సంప్రదింపులు రుపుతూనే ఉన్నామని, అవి కొలిక్కి రావట్లేదని అన్నారు. కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పడం, దిగుమతులపై వంద శాతం ట్యాక్స్‌ను విధించింది.

ఎలాన్ మస్క్‌కు స్వాగతం..

ఎలాన్ మస్క్‌కు స్వాగతం..

కార్ల తయారీకి సంబంధించిన పూర్తిస్థాయి ప్రణాళికను తమకు ముందే అందజేయాలంటూ భారత ప్రభుత్వం షరతులు పెట్టిన విషయం తెలిసిందే. దీనితో ప్రతిష్ఠంభన నెలకొంది. వాటన్నింటినీ పరిష్కరించుకోవడానిక తాము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామంటూ ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.

ఈ పరిణామాల మధ్య తెలంగాణ పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎలాన్ మస్క్‌కు ఆయన సాదర స్వాగతం పలికారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాంలటూ ఆహ్వానించారు. కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఉన్నామని అన్నారు.

 టెస్లా కారు టెస్ట్ డ్రైవ్ ఫొటోలు..

టెస్లా కారు టెస్ట్ డ్రైవ్ ఫొటోలు..

ఈ మేరకు ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్‌కు కేటీఆర్ బదులు ఇచ్చారు. తాను తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రినని కేటీఆర్ పరిచయం చేసుకున్నారు. టెస్లా కారు టెస్టింగ్ డ్రైవ్ చేసిన ఫొటోలను జత చేస్తూ మరో ట్వీట్ చేశారు. తెలంగాణలో షోరూమ్‌ను నెలకొల్పాలని కేటీఆర్.. ఎలాన్ మస్క్‌కు విజ్ఞప్తి చేశారు. భారత్‌లో కార్ల షోరూమ్‌ను నెలకొల్పడానికి అనుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు.

అన్ని రకాలుగా సహకారం..

అన్ని రకాలుగా సహకారం..

ఎలాన్ మస్క్ ఆసక్తి చూపితే.. ప్రభుత్వం తరఫున ఆయనకు అన్ని రకాలుగా సహకరిస్తాని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలను నెలకొల్పడానికి తెలంగాణలో అనుకూల వాతావరణం, ప్రభుత్వం ఉందని కేటీఆర్ అన్నారు. పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, సుస్థిరతలో తమ రాష్ట్రం ఛాంపియన్‌గా నిలిచిందని కేటీఆర్ ఈ ట్వీట్‌లో స్పష్టంచేశారు. కొన్ని గంటల తరువాత ఆయన టెస్లా కారుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ట్వీట్ చేశారు.

టేక్ ఎ బోవ్..

టేక్ ఎ బోవ్..

ఎప్పుడూ వార్తల్లో నిలిచే టెస్లా కారును టెస్ట్ డ్రైవ్ చేశానని చెప్పారు. టెస్లా మోడల్ ఎక్స్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ 2016 జూన్ 5వ తేదీన పోస్ట్ చేసిన ఫొటోలను ఆయన రీట్వీట్ చేశారు. టేక్ ఎ బోవ్ అంటూ టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌ను ప్రశంసించారు. తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించడంలో కేటీఆర్ ఇప్పటికే విజయం సాధించారు. అమెజాన్, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ సంస్థలు హైదరాబాద్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేశాయి.

English summary

టేక్ ఎ బోవ్: టెస్లాకు తెలంగాణ రెడ్ కార్పెట్: ఎలాన్ మస్క్‌కు కేటీఆర్ వెల్‌కమ్ | Happy to partner Tesla in working through the challenges to set shop in Telangana: Minister KTR

Telangana Minister KTR welcome Tesla Chief Elan Musk to set shop in the State.
Story first published: Saturday, January 15, 2022, 12:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X