For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరికొత్త టెక్నాలజీతో హయర్ హోమ్ అప్లియెన్సెస్

|

గృహోపకరణాల తయారీ సంస్థ హయర్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కొత్తగా 83 ఉత్పత్తులను విడుదల చేసింది. ఇందులో 29 రకాల ఏసీలు, 8 వాషింగ్ మిషన్లు, 27 రిఫ్రిజిరేటర్లు, రెండు మైక్రోఓవెన్లు, పది వాటర్ హీటర్లు, ఏడు రకాల టీవీలు ఉన్నాయి.

వీటిని సరికొత్త టెక్నాలజీతో మార్కెట్‌లోకి ప్రవేశ పెడుతున్నట్లు హయర్ ప్రకటించింది. ఈ మేరకు శనివారం HICCలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హయర్ అప్లియెన్సెస్ ఇండియా అధ్యక్షులు ఎరిక్ బ్రగాంజా, సీనియర్‌ ఉపాధ్యక్షుడు సతీష్ మాట్లాడారు.

తమ కస్టమర్లకు కొత్త టెక్నాలజీ, నాణ్యమైన సేవల్ని అందిస్తూనే ఉంటామని తెలిపారు. కస్టమర్లను ఆకట్టుకునే రీతిలో సరికొత్త ఉత్పత్తుల్ని అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. వైఫై ఎనేబుల్డ్ డ్యూయల్ డ్రమ్ సూపర్ సైలెంట్ వాషింగ్ మిషన్లు మొదలు గూగుల్ సర్టిఫైడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీలు, ఇంటరాక్టివ్ కనెక్టెడ్ రిఫ్రిజిరేటర్లు వంటి అత్యాధునిక ఫీచర్స్‌తో కూడిన ఉత్పత్తులు ఉన్నాయి.

గుడ్‌న్యూస్!: 29 వరకు FASTagలు ఉచితం, ఎలా తీసుకోవలంటే?గుడ్‌న్యూస్!: 29 వరకు FASTagలు ఉచితం, ఎలా తీసుకోవలంటే?

Haier India launches 83 new home appliances

ఆధునిక టెక్నాలజీతో సరికొత్త ఫీచర్స్‌తో రూపొందించిన ఈ ఉత్పత్తులకు కస్టమర్ల నుండి మంచి ఆదరణ ఉంటుందని హయర్ కంపెనీ ప్రెసిడెంట్ ఎరిక్ అన్నారు. గృహోపకరణాల ఉత్పత్తులకు సంబంధించి భారత్‌లో తమ కంపెనీ టాప్ 5లో ఉందని చెప్పారు. 2021 నాటికి టాప్ 3లోకి వెళ్లాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

రిఫ్రిజిరేటర్స్, టెలివిజన్స్, మైక్రోవేవ్ ఓవెన్స్, డీప్ ఫ్రీజర్స్, వాటర్ హీటర్స్, ఏయిర్ కండిషనర్స్‌కు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి సరికొత్త రూపంలో తీసుకు వచ్చినట్లు తెలిపారు. దేశీయంగా హయర్‌కు 20 వేల మంది డీలర్లు ఉన్నారు. ఇందులో 2,000 మంది కంపెనీ డీలర్లు. దేశవ్యాప్తంగా 19,000కు పైగా పిన్‌కోడ్ ప్రాంతాల్లో హయర్ ఎక్స్‌క్లూజివ్ సర్వీసుల్ని అందిస్తోంది.

Read more about: haier india ac
English summary

సరికొత్త టెక్నాలజీతో హయర్ హోమ్ అప్లియెన్సెస్ | Haier India launches 83 new home appliances

Haier India has announced the launch of 83 new home appliances, including 29 air conditioner models for the impending summer season, on Saturday.
Story first published: Sunday, February 23, 2020, 10:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X