For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

GST collections: మళ్లీ రూ.1 లక్ష కోట్లు దాటిన జీఎస్టీ కలెక్షన్లు

|

గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(GST) కలెక్షన్లు మళ్లీ లక్ష కోట్ల రూపాయల కంటే పైకి చేరుకున్నాయి. ఏడాది ప్రాతిపదికన అంటే గత జూలై నెలతో పోలిస్తే 33 శాతం ఎగిశాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది మార్చి నుండి జూలై వరకు జీఎస్టీ కలెక్షన్ల పైన ప్రభావం పడింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా జూన్ నెలలో జీఎస్టీ కలెక్షన్లు రూ.1 లక్ష కోట్ల దిగువకు పడిపోయాయి. అక్టోబర్ 2020 తర్వాత ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. సెకండ్ వేవ్ నుండి కోలుకొని, ఆర్థిక కార్యకలాపాలు పెరగడంతో మళ్లీ లక్ష కోట్ల రూపాయలు దాటాయి.

జూలై నెలలో జీఎస్టీ కలెక్షన్లు రూ.1,16,393 కోట్లు నమోదయ్యాయి. గత ఏడాది జూలైతో పోలిస్తే 33 శాతం వృద్ధి నమోదయిందని, ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2020 సంవత్సరం జూలై నెలలో జీఎస్టీ ద్వారా రూ. 87,422 కోట్లు వసూలు అయ్యాయి. ఈ ఏడాది జూన్ నెలలో రూ.92,849 కోట్లు వచ్చాయి. జూలైలో ఆదాయం రూ.1.16 కోట్లకు పెరిగింది. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ.22,197 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.28,541 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ వసూళ్లు రూ.57,864 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.27,900కోట్లు సహా), సెస్ ద్వారా రూ.7,790 కోట్లు (వస్తువుల దిగుమతిపై వచ్చిన రూ.815 కోట్లతో సహా) వచ్చినట్లు ఆర్థికశాఖ తెలిపింది.

 GST Revenue crosses RS 1 lakh crore for July month

వరుసగా 8 నెలలు పాటు రూ.లక్ష కోట్లకు పైగా వచ్చిన జీఎస్టీ ఆదాయం గత జూన్ నెలలో రూ.లక్ష కోట్లకు దిగువకు పడిపోయింది. మే నెలలో చాలా రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు, లాక్‌డౌన్ అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని, రాబోయే నెలల్లో సైతం జీఎస్టీ ఆదాయం లక్ష కోట్ల రూపాయలు దాటే అవకాశముందని సంబంధిత అధికారులు తెలిపారు.

2021 జనవరి నెలలో జీఎస్టీ కలెక్షన్సు రూ.1,19,847 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 1,13,143, మార్చిలో రూ. 1,23,902 కోట్లు, ఏప్రిల్ నెలలో రూ.1,41,384 కోట్లు, మే నెలలో రూ.1,02,709 కోట్లు, జూన్ నెలలో రూ.92,849 కోట్లు, జూలై నెలలో రూ.1,16,393 కోట్లుగా నమోదయ్యాయి.

English summary

GST collections: మళ్లీ రూ.1 లక్ష కోట్లు దాటిన జీఎస్టీ కలెక్షన్లు | GST Revenue crosses RS 1 lakh crore for July month

The GST collections in July rebounded over the Rs 1 lakh crore mark to Rs 1.16 crore, data released by the FM on Sunday showed.
Story first published: Monday, August 2, 2021, 13:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X