For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

GST return filing: జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ తేదీ పొడిగింపు

|

నెలవారీ జీఎస్టీ సేల్స్ రిటర్న్ ఫైలింగ్ తేదీని పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మే నెలకు సంబంధించి జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయని వారికి ఇది ఊరట. మే జీఎస్టీ ఫైలింగ్ తేదీని మరో పదిహేను రోజులు పెంచి 26వ తేదీ వరకు గడువు ఇచ్చారు. మే 28వ తేదీన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్రాల ఆర్థికమంత్రులు, అధికారులతో సమావేశమైన సందర్భంగా పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

2021 మే నెలకు సంబంధించి సమర్పించాల్సిన నెలవారీ సేల్స్ వివరాల జీఎస్టీఆర్-1 రిటర్న్ గడువును ఈ నెల 11వ తేదీ నుండి 26వ తేదీ వరకు పొడిగించారు. గత ఆర్థిక సంవత్సరానికి కాంపోజిషన్ డీలర్స్ సమర్పించవలసిన వార్షిక రిటర్న్స్ గడువును జీఎస్టీ మండలి 3 నెలలు పొడిగించింది. అంటే జూలై 31వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది.

 GST return filing deadline extended till June 26

కంపెనీల చట్టం కింద నమోదైన పన్ను చెల్లింపుదారులు ఈ ఏడాది ఆగస్ట్ చివరి వరకు తమ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్‌కు బదులు ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ ద్వారా జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(CBIC) తెలిపింది. వ్యాపారులు జీఎస్టీఆర్-1ను దాఖలు చేస్తారు.

English summary

GST return filing: జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ తేదీ పొడిగింపు | GST return filing deadline extended till June 26

The government on Monday said the deadline for filing monthly GST sales returns for May has been extended by 15 days till June 26. The GST Council, chaired by the Union Finance Minister and comprising state counterparts, on May 28 had decided to extend certain compliance relaxations on account of COVID-19.
Story first published: Tuesday, June 1, 2021, 9:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X