పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి వస్తే ధరాభారం తగ్గుతుందని వాహనదారులు ఆశపడుతున్నారు. పెట్రోల్, డీజిల్ వంటి పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు సుముఖంగా లేవు. ఈ నేపథ్యంలో తాజాగా పెట్రోలియం ఉత్పత్తులు-జీఎస్టీపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కోల్‌కతాలో స్పందించారు.

పెట్రోలియం జీఎస్టీతో కలిపే ఉంది కానీ..
పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీతో కలిపే ఉన్నాయని, అయితే వాటిపై ఎలాంటి పన్ను లేదని నిర్మల తెలిపారు. పెట్రోల్, డీజిల్ వంటి పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడం జీఎస్టీ కౌన్సెల్, రాష్ట్రాలపై ఆధారపడి ఉందని చెప్పారు. వాళ్లు ఎప్పుడు అంగీకారం తెలిపితే అప్పుడు అమల్లోకి వస్తుందన్నారు.

రాష్ట్రాలు ఓకే అంటే...
జీఎస్టీ పరిధిలోకి వచ్చినప్పుడు పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందకు తీసుకు వచ్చేందుకు రాష్ట్రాలు అంగీకరిస్తే అందుకు చట్ట సవరణ అవసరం లేదని ఆమె వెల్లడించారు. ఈ అంశం ఇప్పుడు రాష్ట్రాలు, జీఎస్టీ కౌన్సిల్ చేతుల్లో ఉందన్నారు. పెట్రో ఉత్పత్తులు జీఎస్టీతో కలిసే ఉన్నాయని, రాష్ట్రాలు నిర్ణయం చెబితే పెట్రోల్, డీజిల్‌లు దీని పరిధిలోకి వచ్చినట్లే అన్నారు.

ప్రస్తుతం జీరో ట్యాక్స్ రేట్‌లో పెట్రోలియం
దివంగత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దూరదృష్టితో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీతో కలిపి ఉంచినట్లు నిర్మల చెప్పారు. ఈ అంశంపై ఎన్నో డిస్కషన్స్ జరిగాయన్నారు. జైట్లీ ఓ నిబంధన రూపొందించారని, ప్రస్తుతం జీఎస్టీలో జీరో రేటెడ్ పెట్రోలియం ఉత్పత్తి సదుపాయాన్ని రూపొందించారని చెప్పారు.

అప్పుడు పన్ను ఎంతో నిర్ణయించబడుతుంది
వస్తు ఉత్పత్తిగా పెట్రోలియంపై ఎలాంటి పన్ను లేకుండా ప్రొవిజన్‌లో చేర్చారని నిర్మల చెప్పారు. కాబట్టి రాష్ట్రాలు ఓకే చెప్పి, జీఎస్టీ కౌన్సెల్ డిస్కషన్స్ చేసి నిర్ణయించినప్పుడు పన్ను ఎంత ఉంటుందో తెలుస్తుందని చెప్పారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications