For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత వృద్ధి, ద్రవ్యలోటు అంచనాలు సవాలే: మూడిస్

|

2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత నామినల్ వృద్ధి రేటు, ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద సవాల్ అని మూడీస్ అనలిస్ట్ శనివారం అన్నారు. ఆర్థిక వృద్ధిని పెంచే దిశగా నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన అనంతరం స్పందించారు. మార్చి 2021తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి గాను ద్రవ్యలోటును జీడపీలో 3.5 శాతంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. నామినల్ జీడీపీ 10 శాతం ఉంటుందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నామినల్ వృద్ధి రేటును 12 శాతం టార్గెట్‌గా పెట్టుకుంది.

వాహనదారులకు షాక్: FASTAG తీసుకోకుంటే ఈ రాయితీలు ఉండవ్వాహనదారులకు షాక్: FASTAG తీసుకోకుంటే ఈ రాయితీలు ఉండవ్

అంతకుముందు వేసిన అంచనా కంటే భిన్నంగా ఉందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్‌కు చెందిన జీన్ ఫాంగ్ పేర్కొన్నారు. పైగా 2021 ఆర్థిక సంవత్సరంలో నామినల్ గ్రోత్ అంచనా 10 శాతం టార్గెట్‌ను పెట్టుకున్నారని, ఇది సవాల్ అన్నారు. పలు ఆర్థిక సవాళ్లు కూడా ఉంటాయన్నారు.

Growth, fiscal deficit projections challenging to meet: Moodys on India

దేశ ఆర్థిక వృద్ధి పదేళ్ల కనిష్టానికి చేరుకున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి దాదాపు 40 బిలియన్ డాలర్లు, ఫెడరల్ వాటర్ స్కీంకు బిలియన్ల కొద్ది రూపాయలు కేటాయిస్తున్నట్లు బడ్జెట్‌లో తెలిపింది. జూలై - సెప్టెంబర్ క్వార్టర్‌లో భారత వృద్ధి రేటు 4.5 శాతానికి దిగజారింది. డిమాండ్ తగ్గడంతో వ్యాపారాలు కుంగిపోయాయి. కంపెనీల్లోకి పెట్టుబడులు రాలేదు. ఉద్యోగాలను తగ్గించుకోవాల్సి వచ్చింది.

ఏప్రిల్ 1తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6 శాతం నుంచి 6.5 శాతం మధ్య ఉంటుందని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. అయితే అధిక ఆర్థిక లోటుపై కూడా హెచ్చరికలు జారీ చేశారు. వృద్ధి నెమ్మదిగా పెరుగుతోందని, 2020 కంటే వచ్చే ఏడాది వృద్ధి రేటు కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని జీన్ ఫాంగ్ తెలిపారు.

English summary

భారత వృద్ధి, ద్రవ్యలోటు అంచనాలు సవాలే: మూడిస్ | Growth, fiscal deficit projections challenging to meet: Moodys on India

India's nominal growth projection and fiscal deficit target for 2020-21 will be challenging to achieve, a Moody's analyst said on Saturday, after the government presented a federal budget to boost economic growth.
Story first published: Monday, February 3, 2020, 11:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X