కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలని, కంపెనీ పెట్టాలని, మరికొంత మందికి ఉద్యోగాలు కల్పించాలని.. కొంతమంది సంపన్నులకు ఉంటుంది. కానీ వాటికి ఏవేవో అనుమతులు కావాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడికో తిరగాల్సి ఉంటుంది. ఆలోచన వచ్చినా.. ఆచరణలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. ఎందుకొచ్చిన తంటా అని చాలామంది ముందడుగు వేయరు.
అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు అన్నీ మారాయి. కేంద్రంలోని మోడీ సర్కారు కార్పొరేట్ వర్గాలకు చాలా అనుకూలమైన వాతావరణం సృష్టిస్తోంది. దేశంలో వ్యాపారాన్ని మరింత సులభం చేసేందుకు వీలుగా అనేక సంస్కరణలు తీసుకొస్తోంది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మరింత మెరుగు పరిచేందుకు, ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలను ప్రకటిస్తోంది. తాజాగా ఓ సరికొత్త ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ ఫామ్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఉన్న SPICe స్థానంలో కొత్తగా SPICe+ విధానం రానుంది.

త్వరితగతిన అనుమతుల కోసం...
కొత్తగా ఏర్పాటు అయ్యే కంపెనీలకు అవసరమైన అనుమతులన్నీ త్వరితగతిన ఇచ్చేందుకు వీలుగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ సరికొత్త ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ ఫామ్‌ను ఆవిష్కరించింది. ఇది ఈ నెల 15 నుంచి అందుబాటులోకి రానుంది. ఎస్‌పీఐసీఈ+(సింప్లిఫైడ్ ప్రోఫార్మా ఫర్ ఇన్‌కార్పొరేటింగ్ కంపెనీ ఎలక్ట్రానికలీ ప్లస్) పేరుతో ఈ ఎలక్ట్రానిక్ ఫామ్‌ను అందుబాటులో ఉంచుతున్నారు.

10 రకాల సర్వీసులు...
ఈ-ఫామ్ ద్వారా 10 రకాల సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఈ ఎలక్ట్రానిక్ ఫామ్‌తోనే ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీ రిజిస్ట్రేషన్ నెంబర్లను కూడా వెంటనే జారీ చేస్తారు. ఫలితంగా దేశంలో కొత్తగా కంపెనీలు ఏర్పాటు చేయాలని భావించే వారికి ఆయా అనుమతుల కోసం చేసే ఖర్చుతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది.

కొత్త కంపెనీలకు అవి తప్పనిసరి...
కార్మిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ డిపార్ట్‌మెంట్, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ-ఫామ్ ద్వారా మరికొన్ని సర్వీసులను ఆఫర్ చేయనున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి ఏర్పాటు చేయబోయే అన్ని కొత్త కంపెనీలకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ), ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్‌ఐసీ)ఖాతాలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

అన్నీ ఈ-ఫామ్ ద్వారానే...
ఇకమీదట ఈపీఎఫ్‌ఓ,ఈఎస్‌ఐసీ రిజిస్ట్రేషన్ నెంబర్లను సంబంధిత ఏజెన్సీలు విడిగా జారీ చేయవని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెబుతోంది. కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీకి పర్మినెంట్ అకౌంట్ నెంబర్(పాన్), ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నెంబర్(టాన్), ప్రొఫెషన్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్(మహారాష్ట్ర), బ్యాంక్ అకౌంట్ ప్రారంభించడం.. ఇవన్నీ కూడా ఇకమీదట ఈ-ఫామ్ ద్వారానే జారీ చేయనున్నారు. డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్(డీఐఎన్), జీఎస్టీఐఎన్‌లకు దరఖాస్తు చేసుకుంటే.. వాటిని కూడా దీని ద్వారానే అందించనున్నారు.

ఎంసీఏ21లో కూడా ఈ-ఫామ్...
కొత్త కంపెనీల ఏర్పాటుకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పోర్టల్ ఎంసీఏ21 ద్వారా అనుమతులు జారీ చేస్తోంది. ప్రస్తుతం మన దేశంలో ఏర్పాటు అయిన కంపెనీలలో 11.5 లక్షలకుపైగా యాక్టివ్ కంపెనీలున్నాయి. యాక్టివ్ కంపెనీ అంటే.. రెగ్యులేటరీకి సంబంధించిన అన్ని ఫైలింగ్స్‌ను నిర్ణీత వ్యవధిలో సమర్పిస్తున్న కంపెనీ అన్నమాట. అలాగే ప్రతి నెలా కొత్తగా 1000 కంపెనీలకు పైగా ఏర్పాటు అవుతున్నాయి. ప్రస్తుతం కొత్తగా తీసుకొచ్చిన ఈ-ఫామ్‌ను కూడా ఈ ఎంసీఏ21 పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications