For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

FY26 నాటికి 4 శాతం కేంద్ర ప్రభుత్వం జీడీపీ లక్ష్యం!

|

కేంద్ర ప్రభుత్వం చేసే ఖర్చులు, ఆదాయం మధ్య వ్యత్యాసమే ద్రవ్యలోటు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో ఇది 7 శాతం నుండి 8 శాతం మధ్య ఉంటుందని భావిస్తున్నారు. అనేక చర్యలతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను దీనిని 4 శాతానికి తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. ఫిస్కల్ రెస్పాన్సిబులిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం మధ్యస్థాయి ద్రవ్యలోటు 3 శాతం ఉండవచ్చునని నిర్దేశించారు.

అయితే 2014-15 నుండి 2020-21 వరకు ఏ సంవత్సరం కూడా ఈ లక్ష్యాన్ని చేరుకోలేదు. అలాంటిది ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ లక్ష్యాన్ని చేరడం సాధ్యం కాదని అంటున్నారు. కరోనా నుండి కోలుకోవాలంటే ప్రజల వద్దకు డబ్బు చేరాలి. ప్రభుత్వ స్పెండింగ్స్ పెరగాలి. అంటే ప్రభుత్వం తన రాబడికి మించి ఖర్చును పెంచాలి. అప్పుడే ద్రవ్యలోటు పెరుగుతుంది.

Government to overhaul fiscal roadmap, may aim budget deficit at 4 percent of GDP by FY26

కరోనా దెబ్బతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. దీంతో ప్రభుత్వం రూ.30 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇవి బడ్జెట్‌కు అదనం. కాబట్టి బడ్జెట్‌లో నిర్దేశించిన 3.5 శాతం ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో పక్కన పెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో కూడా మౌలిక రంగంతో పాటు వైద్య రంగంపై వ్యయాలు పెరగనున్నాయి. 2025-26నాటికి మాత్రం బడ్జెట్ డెఫిసిట్ 4 శాతానికి తగ్గేలా రోడ్ మ్యాప్ ఉండవచ్చు.

English summary

FY26 నాటికి 4 శాతం కేంద్ర ప్రభుత్వం జీడీపీ లక్ష్యం! | Government to overhaul fiscal roadmap, may aim budget deficit at 4 percent of GDP by FY26

The fiscal deficit -- difference between Centre's expenditure and revenue - is expected to be in the range of 7-8 percent of GDP in 2020-21. From that, it may gradually come down to 4 percent of GDP by 2025-26. This means that the long-standing medium- term target of 3 percent of GDP, as mandated by the FRBM Act, no longer holds.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X