For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రూడ్ ట్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి FY23లో రూ.95,000 కోట్ల ఆదాయం

|

దేశీయ ముడి చమురు, ఇంధన ఎగుమతులపై విధించిన పన్నుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి దాదాపు 12 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరనుందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ మంగళవారం తెలిపింది. ఇది మన కరెన్సీలో దాదాపు రూ.95,000 కోట్లు) అదే సమయంలో దేశీయ అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీకి మాత్రం లాభాలు తగ్గుతాయని తెలిపింది.

రూపాయి బలహీనపడినప్పటికీ, విదేశీ రుణాల చెల్లింపుకు సంబంధించిన ఏవైనా సమస్యలు వచ్చినా ముందస్తుగా తొలగించేందుకు మన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు సరిపోతాయని తెలిపింది. పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని అదుపు చేయడానికి మే నెలాఖరులో ప్రకటించిన పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ప్రతికూల ప్రభావం పడినప్పటికీ, అదనపు ఆదాయం సహాయపడుతుందని తెలిపింది. గణనీయమైన అదనపు పన్ను రాబటి సార్వభౌమాధికారంపై ఆర్థిక ఎత్తిడిని భర్తీ చేస్తుందని పేర్కొంది.

Government to get $12 billion from tax on crude in rest of fiscal year

జూలై 1 ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన పన్నులను సవరించింది. పన్ను పెంపు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఓఎన్జీసీ వంటి సంస్థల లాభాలపై ప్రభావం చూపుతాయని తెలిపింది. దీని ప్రకారం భారత చమురు రంగ కంపెనీలు లీటర్ పెట్రోల్ పైన, ఏటీఎఫ్ పైన రూ.6 లేదా బ్యారెల్‌కు 12.2 డాలర్లు, డీజిల్ పైన రూ.13 లేదా బిలియన్ 26.3 డాలర్లుగా ఉంది.

English summary

క్రూడ్ ట్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి FY23లో రూ.95,000 కోట్ల ఆదాయం | Government to get $12 billion from tax on crude in rest of fiscal year

The taxes imposed on domestic crude oil and fuel exports will generate close to $12 billion for the government in the remainder of the current fiscal, Moody's Investors Service said Tuesday, while trimming profit forecasts for Reliance Industries Ltd and ONGC.
Story first published: Wednesday, July 6, 2022, 11:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X