అక్టోబర్‌లో పెరిగిన గవర్నమెంట్ స్పెండింగ్స్, పన్ను ఆదాయం రూ.2.6 లక్షల కోట్లు తగ్గొచ్చు
ఢిల్లీ: కేంద్ర బడ్జెట్ స్పెండింగ్స్ అక్టోబర్ నెలలో 9.5 శాతం పెరిగాయి. సెప్టెంబర్ నెలలో 26 శాతం క్షీణించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వార్షిక వ్యయ వృద్ధి బడ్జెట్ 13.2 శాతంగా ఉంటుందని అంచనా. ఏప్రిల్-అక్టోబర్ మధ్య గణాంకాలు రెండు శాతం క్షీణత కనిపించినప్పటికీ అక్టోబర్ నెలలో రూ.31,519తో కాపెక్స్ 130 శాతం పెరిగింది. ఏప్రిల్-అక్టోబర్‌లో నికర పన్ను ఆదాయం సంవత్సరానికి 16 శాతం తగ్గింది. ఈ నేపథ్యంలో ద్రవ్యలోటు బడ్జెట్‌లో అంచనా వేసిన రూ.8 లక్షల కోట్ల కంటే రెట్టింపు ఉంటుందని భావిస్తున్నారు. ఏప్రిల్-అక్టోబర్ ఆర్థిక లోటు లక్ష్యంతో 119.7 శాతంగా ఉంది.

పన్ను ఆదాయం రూ.2.6 లక్షల కోట్లు తగ్గవచ్చు
అన్-లాక్ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటున్నప్పటికీ పన్ను వసూళ్లు లక్ష్యం కంటే రూ.2.6 లక్షల కోట్ల మేర తగ్గవచ్చునని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. బడ్జెట్‌లో పన్ను వసూళ్ల లక్ష్యం రూ.24.23 లక్షల కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరానికి పన్ను వసూళ్ల మొత్తానికి సమానంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వసూలైన పర్లేదని, అయితే అంతకంటే తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు.

21.6 శాతం తక్కువ
2019-230 స్థూల పన్ను వసూళ్లు సవరించిన అంచనా రూ.21.63 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో వసూలైన రూ.20.10 లక్షల కంటే ఇది 7.6 శాతం ఎక్కువ. 2020.21లో మొదటి అర్ధ సంవత్సరంలో పన్ను మొత్తం రూ.7.21 లక్షల కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో వసూలైన మొత్తం కంటే 21.6 శాతం తక్కువ.

పన్ను వసూళ్ల అంచనాలు సవరించవచ్చు
కరోనా కారణంగా మార్చి చివరి వారం నుండి దాదాపు మూడు నెలల పాటు దేశమంతా లాక్ డౌన్లో ఉంది. అందుకే పన్ను వసూళ్ల లోటు గతంలో అంచనా వేసినంతగా ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. 2019-20 అదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో పన్ను ఆదాయం 32.6 శాతం, జూలై-సెప్టెంబర్ కాలంలో 13.1 శాతం తగ్గింది. డిసెంబర్ క్వార్టర్ తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పన్ను వసూళ్ల అంచనాలను సవరించే అవకాశాలు ఉంటాయి.