For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇప్పట్లో లేనట్లే.. ఫ్లిప్‌కార్ట్‌కు షాకిచ్చిన ప్రభుత్వం, ఎందుకంటే

|

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు షాక్. వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఈ కంపెనీ ఫుడ్ రిటైల్ రంగంలోకి అడుగుపెట్టాలని భావించింది. ఇందుకు సంబంధించి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఈ దరఖాస్తును పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహకాల శాఖ (DPIIT) తిరస్కరించింది. నియంత్రణపరమైన సమస్యలు ఉన్నాయని పేర్కొంది.

మాల్స్‌కు గుడ్‌బై: గళ్లీలోని కిరాణా దుకాణమే ముద్దు, ఆ బ్రాండ్స్‌నే కొంటాంమాల్స్‌కు గుడ్‌బై: గళ్లీలోని కిరాణా దుకాణమే ముద్దు, ఆ బ్రాండ్స్‌నే కొంటాం

ఫ్లిప్‌కార్ట్‌కు నో

ఫ్లిప్‌కార్ట్‌కు నో

ప్రభుత్వం నో చెప్పడంతో ఆహారోత్పత్తుల రిటైల్ విభాగంలో ప్రవేశించాలని భావించిన ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో పర్మిట్ కోసం మరోసారి దరఖాస్తు చేయాలని ఫ్లిప్‌కార్ట్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దేశఈయంగా ఉత్పత్తి/తయారీ చేసిన ఫుడ్ రిటైల్ సంస్థల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రభుత్వం అనుమతిస్తోన్న విషయం తెలిసిందే.

మా ప్రయత్నాలు అలా ఉంటాయి

మా ప్రయత్నాలు అలా ఉంటాయి

టెక్నాలజీ, నవకల్పనల ఆధారిత మార్కెట్ విధానాలతో దేశీయంగా రైతులు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి మరింత విలువ చేకూరుతుందని, సమర్థత, పారదర్శకత పెరుగుతుందని తాము విశ్వసిస్తున్నామని, చిన్న వ్యాపారులకు ఊతమిచ్చే విధంగా పర్మిట్ కోసం మరోసారి దరఖాస్తు చేయాలని భావిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి తెలిపారు. దరఖాస్తు సమయంలోనే దేశంలో వ్యవసాయం, ఫుడ్ తయారీ పరిశ్రమలను ప్రోత్సహించేలా మా ప్రయత్నాలు ఉంటాయని తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్ ఫార్మర్ మార్ట్

ఫ్లిప్‌కార్ట్ ఫార్మర్ మార్ట్

అయితే ప్రభుత్వం దరఖాస్తును తిరస్కరించడంతో ఫ్లిప్‌కార్ట్ ఇప్పట్లో ఫుడ్ రిటైల్ రంగంలోకి అడుగు పెట్టే అవకాశం లేదు. మళ్లీ దరఖాస్తు చేసుకోనుంది.ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికాకు చెందిన రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్ కొనుగోలు చేసింది.ఆ తర్వాత ప్రభుత్వం ఎఫ్‌డీఐలను 100 శాతం అనుమతిస్తున్నాయి. దీంతో గత ఏడాది ఫ్లిప్‌కార్ట్ స్థానికంగా ఫ్లిప్‌కార్ట్ ఫార్మర్ మార్ట్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఫుడ్ రిటైల్ రంగంపై దృష్టి పెట్టాలని భావించింది.

English summary

ఇప్పట్లో లేనట్లే.. ఫ్లిప్‌కార్ట్‌కు షాకిచ్చిన ప్రభుత్వం, ఎందుకంటే | Government rejects Flipkart's plan to enter food retail

The government has rejected Flipkart’s proposal to enter the food retail business in a setback for Walmart, which owns a majority of the Indian e-commerce firm and which recently counted its business in Asia’s third-largest economy as one of the worst impacted by the global coronavirus pandemic.
Story first published: Tuesday, June 2, 2020, 16:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X