For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీపీఎఫ్, పోస్టాఫీస్‌లలో డబ్బులు దాచుకునే వారికి షాక్, వడ్డీ తగ్గింపు

|

బ్యాంకులు, పోస్టాఫీస్ వంటి వాటిల్లో డబ్బులు దాచుకునే వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి స్మాల్ సేవింగ్స్ స్కీంలపై వడ్డీ రేటును తగ్గించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌కు గాను వడ్డీ రేటును 1.4 శాతం తగ్గించింది. చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేట్లు త్రైమాసికం ప్రాతిపదికన ఉంటుంది.

కస్టమర్లకు జియో గుడ్‌న్యూస్, ఏప్రిల్ 17 వరకు ఇవి ఉచితం: ఇలా సులభంగా రీఛార్జ్ చేయండి..కస్టమర్లకు జియో గుడ్‌న్యూస్, ఏప్రిల్ 17 వరకు ఇవి ఉచితం: ఇలా సులభంగా రీఛార్జ్ చేయండి..

70 బేసిస్ పాయింట్ల నుండి 140 బేసిస్ పాయింట్లు తగ్గింపు

70 బేసిస్ పాయింట్ల నుండి 140 బేసిస్ పాయింట్లు తగ్గింపు

పోస్టాఫీస్ సేవింగ్స్ పథకాల్లో, సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే ఇది మీకు చేదు వార్తే. 70 నుండి 140 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించింది. అంటే 70 పైసల నుండి 140 పైసల వరకు వడ్డీ తక్కువగా వస్తుంది.

ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు ఈ వడ్డీ

ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు ఈ వడ్డీ

ఈ వడ్డీ రేట్లు ఏప్రిల్ నుండి జూన్ వరకు వర్తిస్తాయి. కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఆర్బీఐ రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. బ్యాంకులు ఆఫర్ చేసే వడ్డీ రేట్ల కంటే చిన్న మొత్తాల పొదుపు స్కీంల వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటున్నాయని, తగ్గించాలని బ్యాంకులు డిమాండ్ చేస్తున్నాయి.

టర్మ్ డిపాజిట్..

టర్మ్ డిపాజిట్..

ప్రస్తుత వడ్డీ రేటు తగ్గింపుతో టర్మ్ డిపాజిట్ పైన వడ్డీ రేటు 6.9 శాతం నుండి 5.5 శాతానికి తగ్గుతుంది. అంటే 1.4 శాతం తగ్గుతుంది. ఐదేళ్ల టర్మ్ డిపాజిట్ ప్రస్తు రేటు 7.7 శాతంగా ఉండగా ఇది 6.7 శాతానికి తగ్గింది.

English summary

పీపీఎఫ్, పోస్టాఫీస్‌లలో డబ్బులు దాచుకునే వారికి షాక్, వడ్డీ తగ్గింపు | Government cuts interest rates on PPF and post office deposit schemes from April 1

The government on Tuesday slashed interest rates on small savings schemes, including National Savings Certificate and Public Provident Fund, by up to 1.4 per cent for the first quarter of 2020-21, in line with moderation in bank deposit rates.
Story first published: Wednesday, April 1, 2020, 14:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X