Railway: రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటించిన ప్రభుత్వం..
దసరాకు ముందు రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ప్రొడక్షన్-లింక్డ్ బోనస్ (PLB)ని ఆమోదించింది. ఈ నిర్ణయం RPF/RPSF సిబ్బందిని మినహాయించి దాదాపు 11.27 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.

అశ్విని వైష్ణవ్
ఇందుకు సంబంధించి రైల్వే శాఖ మంత్రి ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ స్క్రీన్‌షాట్‌ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. " బోనస్‌ను మంజూరు చేసినందుకు మొత్తం రైలు పరివార్ తరఫున PM @narendramodi గారికి ధన్యవాదాలు" అని రైల్వే మంత్రి ట్వీట్ చేశారు.

రూ.1,832.09 కోట్లు
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పీఎల్‌బీ చెల్లింపు మొత్తం రూ.1,832.09 కోట్లుగా అంచనా అంచనా వేశారు. PLB చెల్లింపు కోసం నిర్దేశించిన వేతన గణన సీలింగ్ నెలకు రూ.7,000. అర్హులైన రైల్వే ఉద్యోగికి 78 రోజులకు చెల్లించాల్సిన గరిష్ట మొత్తం రూ.17,951 అని రైల్వే శాఖ పేర్కొంది.

ప్రాముఖ పాత్ర
రైల్వే ఉద్యోగులు ప్రయాణీకులు, వస్తువుల సేవల పనితీరులో ప్రాముఖ పాత్ర పోషించారని జాతీయ రవాణా సంస్థ పేర్కొంది. ఇది ఆర్థిక వ్యవస్థకు ఉత్ప్రేరకంగా కూడా పనిచేసిందని. వాస్తవానికి, లాక్డౌన్ సమయంలో కూడా రైల్వే ఉద్యోగులు ఆహారం, ఎరువులు, బొగ్గు, ఇతర వస్తువులను నిరంతరాయంగా తరలించారని పేర్కొంది.
|
DA పెంపు
DA, రైల్వే బోనస్, PMGKAY, రైల్వే పునరాభివృద్ధి ప్రాజెక్టులపై గత వారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ను ఆమోదించడమే కాకుండా, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ)ని కూడా 4 శాతం పెంచింది.