For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Google: గూగుల్ కు షాక్ ఇచ్చిన భారత్.. వేల కోట్లు పెనాల్టీ.. అది మానుకోవాలంటూ..

|

CCI: అమెరికా దిగ్గజ కంపెనీ అయిన గూగుల్‌పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారీ జరిమానా విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాల పర్యావరణ వ్యవస్థలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆధిపత్యాన్ని కంపెనీ దుర్వినియోగం చేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

భారీ జరిమానా..
ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్ల విషయంలో పోటీకి వీలు లేని గుత్తాధిపత్య ధోరణి అవలంబించినందుకు CCI రూ.1,337.76 కోట్ల జరిమానా విధించినట్లు గురువాతం ప్రకటించింది. యాంటీ-ట్రస్ట్ రెగ్యులేటర్ ఇంటర్నెట్ మేజర్‌ను అన్యాయమైన వ్యాపార పద్ధతులను నిలిపివేయాలని మరియు మానుకోవాలని కూడా ఆదేశించింది. దీంతో ఆల్ఫాబెట్‌ ఇన్‌కార్పొరేటెడ్‌కు చెందిన గూగుల్‌ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

google penalised with 1338 crores fine by CCI for anti competitive practices

30 రోజుల గడువు..
ఈ వ్యవహారలో అవసరమైన ఆర్థిక వివరాలు, ఇతర పత్రాలను అందించటానికి సీసీఐ గూగుల్‌కు 30 రోజుల సమయం ఇచ్చింది. స్మార్ట్‌ఫోన్‌ తయారీదారులు తమ ఫోన్లలో సర్చ్‌ సర్వీసులు అందిస్తున్నందుకు బదులుగా వారికి గూగుల్‌ కంపెనీ ఎలాంటి రాయితీ ఇవ్వడం లేదని సీసీఐ తన నోటీసుల్లో తెలిపింది. గూగుల్ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కొన్ని యాప్స్ ప్రీ ఇన్టాల్ చేయటం.. అవి కంపెనీకి ఆదాయాన్ని అందించేవిగా ఉండగా ఇతర పోటీదారులను దెబ్బతీస్తోందని సీసీఐ పేర్కొంది. వీటిపై గూగుల్ బదులివ్వాల్సి ఉంటుంది.

Read more about: cci google anroid penalty
English summary

Google: గూగుల్ కు షాక్ ఇచ్చిన భారత్.. వేల కోట్లు పెనాల్టీ.. అది మానుకోవాలంటూ.. | google penalised with 1338 crores fine by CCI for anti competitive practices

google penalised with 1338 crores fine by CCI for anti competitive practices
Story first published: Friday, October 21, 2022, 9:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X