For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీవేర్! గూగుల్ ప్లేస్టోర్ నుండి 29 యాప్స్ తొలగింత, అన్ఇన్‌స్టాల్ చేయండి..

|

భద్రతా తనిఖీల్లో భాగంగా 29 యాప్స్‌లలో యాడ్‌వేర్ అనే వైరస్‌ను గుర్తించింది గూగుల్. దీంతో ప్లేస్టోర్ నుండి వాటిని తొలగించింది. యూజర్ ఆన్‌లైన్‌లో ఉన్న సమయంలో ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేసే సాఫ్టువేర్.. ఈ యాడ్‌వేర్. ఈ యాడ్‌వేర్‌తో నిండిన యాప్స్‌ను తొలగించింది. ఈ యాప్స్ ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌లో 3.5 మిలియన్లకు పైగా డౌన్ లోడ్స్ ఉన్నాయి. సటోరి అనే ఇంటెలిజెన్స్ బృందం జరిపిన భద్రతా తనిఖీల్లో వీటిని గుర్తించారు. ఇందులో ఎక్కువగా ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయని గుర్తించారు. యాప్స్‌లో బ్లర్ అనే పదం హానికరమైనదిగా తేలింది.

హైదరాబాద్‌లో భారీగా తగ్గిన హౌసింగ్ సేల్స్, ధరలు ఎలా ఉన్నాయంటే?

తొలగించిన యాప్స్ ఇవీ..

తొలగించిన యాప్స్ ఇవీ..

Auto Picture Cut (ఆటో పిక్చర్ కట్)

Color Call Flash (కలర్ కాల్ ఫ్లాష్)

Square Photo Blur (స్క్వేర్ ఫోటో బ్లర్)

Square Blur Photo (స్క్వేర్ బ్లర్ ఫోటో)

Magic Call Flash (మాజిక్ కాల్ ఫ్లాష్)

Easy Blur (ఈజీ బ్లర్)

Image Blur (ఇమేజ్ బ్లర్)

Auto Photo Blur (ఆటో ఫోటో బ్లర్)

Photo Blur (ఫోటో బ్లర్)

Photo Blur Master (ఫోటో బ్లర్ మాస్టర్)

Super Call Screen (సూపర్ కాల్ స్క్రీన్)

Square Blur Master (స్క్వేర్ బ్లర్ మాస్టర్)

Square Blur (స్క్వేర్ బ్లర్)

Smart Blur Photo (స్మార్ట్ బ్లర్ ఫోటో)

Smart Photo Blur (స్మార్ట్ ఫోటో బ్లర్)

Super Call Flash (సూపర్ కాల్ ఫ్లాష్)

Smart Call Flash (స్మార్ట్ కాల్ ఫ్లాష్)

Blur Photo Editor (బ్లర్ ఫోటో ఎడిటర్)

Blur Image (బ్లర్ ఇమేజ్)

ఇన్‌స్టాల్ తర్వాత ఫోన్లో కనిపించకుండా పోతుంది

ఇన్‌స్టాల్ తర్వాత ఫోన్లో కనిపించకుండా పోతుంది

ఈ ఆండ్రాయిడ్ యాప్స్‌లలో వినియోగంలోని లేని యాడ్స్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. వీటిలో ఏ యాప్ అయినా యూజర్ ఇన్‌స్టాల్ చేస్తే ఫోన్లో లాంచ్ ఐకాన్స్ వెంటనే కనిపించకుండా పోతాయి. దీంతో యూజర్ ఈ యాప్స్‌ను డిలీట్ చేయడం కష్టమవుతుంది. ఫోటో ఎడిటింగ్‌కు సంబంధించిన ఈ 29 యాప్స్‌తో చార్టర్ యూజర్ బ్లర్ అనే కోడ్‌తో ఈ యాడ్‌వేర్‌ను యాప్స్ ద్వారా ఫోన్లలోకి ప్రవేశింప చేస్తున్నట్లు వెల్లడించారు.

అందుకే తొలగింపు

అందుకే తొలగింపు

ఈ యాప్స్ ఓపెన్ చేసిన కొద్ది సెకన్లలోనే యాడ్స్ వచ్చి, పోన్లో యూజర్ చేసే ప్రతి చర్యకు కోడ్ ఉత్పన్నమై యాడ్ పాపప్ అవుతుందని చెబుతున్నారు. అలా యాడ్స్ వచ్చి ఫోన్ స్క్రీన్ పైన మొత్తం ఆక్రమిస్తాయి. కొన్నిసార్లు వెబ్ బ్రౌజర్లను కూడా ఓపెన్ చేస్తున్నట్లు గుర్తించారు. ఫోన్ అన్‌లాకింగ్, అన్‌ఇన్‌స్టాలింగ్ యాప్, ఫోన్ చార్జింగ్, వైఫేకి కనెక్ట్ వంటి ఫీచర్స్ ద్వారా యాడ్ పాపప్ అవుతున్నట్లు గుర్తించారు. అందుకే ఈ 29 యాప్స్‌ను తొలగించింది గూగుల్. ఈ యాప్స్ ఉన్న వారు కూడా వీటిని అన్‌ఇన్‌స్టాల్ చేయాలని సూచిస్తున్నారు.

ఇటీవల కూడా పలు యాప్స్ తొలగింపు

ఇటీవల కూడా పలు యాప్స్ తొలగింపు

యూజర్ల డేటాకు భంగం కలిగించే యాప్స్‌ను ఎప్పటికప్పుడు గుర్తించి తొలగిస్తుంది గూగుల్. ఇందులో భాగంగా ఈ నెల ప్రారంభంలో నిబంధనల ఉల్లంఘన, సమాచార అపహరణ వంటి కారణాలతో 25 యాప్స్ తొలగించగా, రెండో వారంలో మరో 11 యాప్స్ తొలగించింది. ఇప్పుడు 29 యాప్స్‌ను రిమూవ్ చేసింది. యాడ్‌వేర్ కలిగి ఉన్న స్క్వేర్ ఫోటో బ్లర్ యాప్‌ను పరిశీలించగా ఫోన్లలో ఓసీసీ యాడ్స్ అమలు, ఇన్‌స్టాల్ చేశాక లాంచ్ ఐకాన్ అదృశ్యం, ప్లేస్టోర్‌లో ఓపెన్ ఫంక్షన్ లేకపోవడం గుర్తించారు.

English summary

బీవేర్! గూగుల్ ప్లేస్టోర్ నుండి 29 యాప్స్ తొలగింత, అన్ఇన్‌స్టాల్ చేయండి.. | Google has removed 29 apps for injecting adware

Yet another shocking case of apps harming smartphones has come to light. Search engine giant Google has removed as many as 29 apps from the Play Store that were found filled with adware.
Story first published: Wednesday, July 29, 2020, 16:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X