కరోనా వైరస్ కారణంగా రియల్ ఎస్టేట్ రంగం భారీగా దెబ్బతిన్నది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఏప్రిల్ - జూన్ క్వార్టర్‌లో 8 ముఖ్య నగరాల్లో హౌసింగ్ సేల్స్ పెద్ద ఎత్తున పడిపోయాయి. లాక్ డౌన్, ఉద్యోగాల కోత, వేతనాల కోత వంటి వివిధ కారణాల వల్ల సేల్స్ పడిపోయాయి. హౌసింగ్ సేల్స్ పడిపోయినట్లు వివిధ ప్రాపర్టీ సంస్థలు తమ నివేదికలో తెలిపాయి. తాజాగా రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ ఎనిమిది నగరాల్లో సేల్స్ 79 శాతం పడిపోయి 19,038 యూనిట్లకు పరిమితమైనట్లు వెల్లడించింది.
పడిపోయిన హౌసింగ్ సేల్స్. మరిన్ని కథనాలు

జనవరి-జూన్ మధ్య 52 శాతం తగ్గుదల
'రియల్ ఇన్‌సైట్:Q2 2020' పేరుతో నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం జనవరి - జూన్ మధ్యకాలంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ సేల్స్ 52 శాతం పడిపోయి 88,593 యూనిట్లకు పరిమితమయ్యాయి. హైదరాబాద్‌తో పాటు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ-ఎన్సీఆర్ (నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్), ఎంఎంఆర్ (ముంబై, నేవీ ముంబై, థానే), పుణే నగరాల సేల్స్ నివేదికను వెల్లడించింది. సేల్స్ తగ్గడంతో ఈ రంగంలో నిరుద్యోగిత రేటు కూడా పెరిగింది.

హైదరాబాద్‌లో సేల్స్ ఎంత తగ్గాయంటే
తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ కీలక నగరం. ఇక్కడ ఏప్రిల్-జూన్ 2020 క్వార్టర్‌లో హౌసింగ్ సేల్స్ ఏకంగా 86 శాతం పడిపోయి 1,099 యూనిట్లకు పరిమితమయ్యాయు. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 8,122 హౌస్ సేల్ అయ్యాయి.
జనవరి-జూన్ 2020 విషయానికి వస్తే.. అంటే ఆరు నెలల కాలంలో సేల్స్ 62 శాతం తగ్గి 6,653 యూనిట్లకు పడిపోయాయి.

ధరలు ఎలా ఉన్నాయి
గత కొంతకాలంగా హౌసింగ్, రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతున్నాయి. అయితే ఈసారి కరోనా ఒత్తిడి కారణంగా ధరల్లో పెరుగుదల లేదు. గత ఏడాది దాదాపు అన్ని ముఖ్య నగరాల్లో ధరలు 1 శాతం నుండి 3 శాతం మధ్య పెరిగాయి. హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాల్లో మాత్రం మిగతా నగరాలతో పోలిస్తే మరింత వృద్ధి కనిపించింది. 2019 ఏప్రిల్-జూన్ క్వార్టర్‌తో పోలిస్తే ఈసారి ధరలు హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాల్లో వరుసగా 7 శాతం, 6 శాతం పెరిగాయి. అయితే ఈసారి కరోనా కారణంగా ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయితే గత రెండేళ్ల పెరుగుదలతో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయి.

ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో ఏ నగరంలో ఎంత శాతం తగ్గింది
ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో ముంబైలో సేల్స్ గత ఏడాది 29,635 యునిట్లుగా ఉండగా ఈసారి 85 శాతం పడిపోయి 4,559 యూనిట్లకు పరిమితమయ్యాయి.
అహ్మదాబాద్ నగరంలో గత ఏడాది 6,784 హౌసింగ్ సేల్స్ ఉండగా, ఈసారి 83 శాతం తగ్గి 1,181 యూనిట్లకు పరిమితమయ్యాయి.
ఢిల్లీలో గత ఏడాది 9,759 యూనిట్లు ఉండగా ఈసారి 81 శాతం తగ్గి 1,886 యూనిట్లకు పరిమితమయ్యాయి.
కోల్‌కతాలో 75 శాతం పడిపోయాయి. గత ఏడాది 5268 యూనిట్లు సేల్ కాగా, ఈసారి 1,317గా ఉన్నాయి.
పుణేలో గత ఏడాది 18,581 యూనిట్లు అమ్ముడుపోగా ఈసారి 74 శాతం క్షీణించి 4,908 యూనిట్లకు పరిమితమయ్యాయి.
బెంగళూరులో గత ఏడాది 10,251 యూనిట్లు సేల్ కాగా ఈసారి 73 శాతం తగ్గి 2,776 యూనిట్లకు పరిమితమయ్యాయి.
చెన్నైలో గత ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో 4,364 సేల్ కాగా, ఈసారి 70 శాతం క్షీణించి 1,312 యూనిట్లకు పరిమితమయ్యాయి.

జనవరి-జూన్ మధ్య ఏ నగరంలో ఎంత శాతం తగ్గింది
జనవరి-జూన్ మధ్య అహ్మదాబాద్‌లో హౌసింగ్ సేల్స్ 57 శాతం తగ్గి 5,692 యూనిట్లకు పరిమితమయ్యాయి.
బెంగళూరులో 48 శాతం తగ్గి 10,973 యూనిట్లకు, ఢిల్లీ-ఎన్సీఆర్‌లో 64 శాతం తగ్గి 7,297 యూనిట్లకు, చెన్నైలో 45 శాతం పడిపోయి 4,955 యూనిట్లకు, కోల్‌కతాలో 59 శాతం పడిపోయి 4,064 యూనిట్లకు, ముంబైలో 50 శాతం తగ్గి 28,528 యూనిట్లకు, పుణేలో 44 శాతం క్షీణించి 20,431 యూనిట్లకు తగ్గాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications