For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

GST: సెప్టెంబర్‍లో రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. ఎంత వచ్చాయంటే..

|

దేశంలో పన్ను వసూళ్లు రికార్డు సృష్టిస్తున్నాయి.సెప్టంబర్ లో వస్తు సేవల పన్ను వసూళ్లు (GST) మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు వరుసగా ఏడవ నెలలో రూ. 1.4 ట్రిలియన్ మార్కుకు ఎగువన కొనసాగాయి ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటన విడుదల చేసింది.

26శాతం వృద్ధి

26శాతం వృద్ధి

సెప్టెంబరు నెలకు గానూ రూ.1,47,686 కోట్లు వసూలైనట్లు పేర్కొంది. గతేడాది సెప్టెంబరు నెలతో పోలిస్తే 26శాతం వృద్ధి నమోదైందని వివరించింది. సెప్టెంబర్‌లో వసూలైన మొత్తం స్థూల జీఎస్టీ ఆదాయంలో సీజీఎస్టీ రూ.25,271 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.31,813 కోట్లు, ఐజీఎస్టీ రూ.80,464 కోట్లు, సెస్ రూ.10,137 కోట్లు వసూలైనట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఏడోసారి

ఏడోసారి

జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లపైన నమోదవ్వడం వరుసగా ఇది ఏడోసారి. జీఎస్టీ కౌన్సిల్‌ తీసుకున్న పలు చర్యలు, ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం.. భారీ స్థాయిలో జీఎస్టీ వసూళ్లకు దోహదం చేసినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. గత నెలలో దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం 39శాతం పెరిగిందని, ఇక దేశీయ లావాదేవీల ఆదాయంలో 22శాతం వృద్ధి నమోదైందని వెల్లడించింది.

39 శాతం

39 శాతం

సెప్టెంబర్ లో రెండో అత్యధిక సింగిల్ డే కలెక్షన్ రూ. 49,453 కోట్లు సెప్టెంబర్ 20న 877,000 చలాన్లు దాఖలయ్యాయి. తర్వాతి స్థానంలో రూ. జూలై 20న 958,000 చలాన్‌ల ద్వారా 57,846 కోట్లు వచ్చాయి. ఇది సంవత్సరం ముగింపు రిటర్న్‌లకు సంబంధించినది. ఈ నెలలో, వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 39 శాతం ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.

ఏపీలో 20 శాతం వృద్ధి

ఏపీలో 20 శాతం వృద్ధి

తెలంగాణలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వసూళ్లు 12శాతం పెరిగాయి. తెలంగాణలో 2021 సెప్టెంబరులో రూ.3,494కోట్లుగా ఉన్న ఈ వసూళ్లు.. గత నెలలో రూ.3,915కోట్లుకు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ వసూళ్లలో 21శాతం వృద్ధి నమోదు అయింది.

English summary

GST: సెప్టెంబర్‍లో రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. ఎంత వచ్చాయంటే.. | Goods and Services Tax (GST) collections were once again at a record level

Tax collections are creating a record in the country. In September, the Goods and Services Tax (GST) collections were once again at a record level.
Story first published: Sunday, October 2, 2022, 10:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X