For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.49,000 దిశగా పరుగు పెడుతున్న బంగారం ధరలు

|

బంగారం ధరలు రూ.49,000 దిశగా పరుగులు పెడుతున్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నేటి (జనవరి 25) ప్రారంభ సెషన్‌లో రూ.35 పెరిగి రూ.48,599 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.33 ఎగిసి రూ.48,617 వద్ద ప్రారంభమైంది.నిన్నటి సెషన్‌లో అయితే భారీగా పెరిగాయి. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.350 పెరిగి రూ.48,599 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.308 పెరిగి రూ.48,592 వద్ద ముగిసింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.7600 మాత్రమే తక్కువగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లోను 1850 డాలర్ల దిశగా కనిపిస్తోంది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్లో 1.25 డాలర్లు లాభపడి 1842.95 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1841 డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్లో 1843.50 డాలర్ల వద్ద ప్రారంభమైంది. ఏడాదిలో 1.52 శాతం తగ్గింది. నేటి సెషన్‌లో 1,839.40 - 1,843.85 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది.

Gold, silver prices today: Precious metals record hike on MCX

వెండి ధరలు గతవారం భారీగా పెరిగి, ఆ తర్వాత అతి స్వల్పంగా తగ్గాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ నేటి సెషన్లో రూ.50 తగ్గి రూ.64,008 వద్ద ట్రేడ్ అయింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.11 క్షీణించి రూ.64,640 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.037 డాలర్లు లాభపడి 23.837 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

English summary

రూ.49,000 దిశగా పరుగు పెడుతున్న బంగారం ధరలు | Gold, silver prices today: Precious metals record hike on MCX

On Tuesday, January 25, 2022, both gold and silver are trading on the higher side of the Multi Commodity Exchange (MCX). Witnessing a marginal hike of Rs 24 or 0.05 per cent, gold futures maturing on February 4, 2022, are retailing at Rs 48,620 per 10 grams on the MCX.
Story first published: Tuesday, January 25, 2022, 10:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X