బంగారం ధరలు షాకిస్తున్నాయి. అంతర్జాతీయ స్పాట్, ఫ్యూచర్ మార్కెట్లో ధరలు పెరగడం ప్రభావం చూపింది. నేడు (మే 26, బుధవారం) పసిడి ధరలు రూ.49,000 మార్కు దాటడంతో నాలుగున్నర నెలల గరిష్టానికి చేరుకున్నాయి. యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ తగ్గిపోవడం, డాలర్ వ్యాల్యూ తగ్గడం సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి డిమాండ్ వచ్చింది. మంగళవారం కూడా బంగారం, వెండి ధరలు పెరిగిన విషయం తెలిసిందే. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.7,200 వరకు తక్కువగా ఉంది. కేవలం రెండు నెలల్లోనే రూ.5,000 వరకు పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.72,000 దాటి రూ.73వేల దిశగా సాగుతోంది.

రూ.49వేలు దాటిన బంగారం
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.155.00 (0.32%) పెరిగి రూ.49022.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,067.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,083.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,961.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.170.00 (0.34%) పెరిగి రూ.49490.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,530.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,564.00 గరిష్టాన్ని, రూ.49,421.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.73వేల దిశగా వెండి
వెండి ఫ్యూచర్ ధరలు ఉదయం పెరిగాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.470.00 (0.65%) పెరిగి రూ.72610.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,500.00 వద్ద ప్రారంభమై, రూ.72,681.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.72,500.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.498.00 (0.68%) పెరిగి రూ.73730.00 వద్ద ట్రేడ్ అయింది. 73,665.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.73,767.00 గరిష్టాన్ని, రూ.73,616.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు పెరిగాయి. మళ్లీ 1900 డాలర్లను క్రాస్ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 8.70 (0.46%) డాలర్లు తగ్గి 1,906.70 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,897.65 - 1,908.25 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.221 (0.79%) డాలర్లు పెరిగి 28.280 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 28.082 - 28.335 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!



Click it and Unblock the Notifications