బంగారం ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ తగ్గుదల కంటిన్యూ అవుతుందా లేక భవిష్యత్తులో ర్యాలీ ఉంటుందా అనే దానిపై పెట్టుబడిదారులు అయోమయంలో పడిపోయారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుధ్ద మేఘాలు పసిడి మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. డాలర్ విలువ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని పరిస్థితి. దీంతో పెట్టుబడిదారులు డాలర్ రిస్క్ ఆస్తులను వదిలేసి బంగారం మీదకు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో పసిడి ధరలకు రెక్కలు వస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి, బలమైన పెట్టుబడి డిమాండ్, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు కారణంగా బంగారం ధరల ర్యాలీ ఇంకా కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. World Gold Council ప్రాంతీయ సీఈఓ (ఇండియా) Sachin Jain మాట్లాడుతూ.. బంగారం ధరల ర్యాలీ ఆగిపోలేదని ముందు ముందు ఇంకా కొనసాగుతుందని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలను India Today Conclave 2026 సందర్భంగా ఆయన చేశారు. గత మూడు దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో Gold పాత్ర గణనీయంగా మారిందని.. ప్రస్తుతం బంగారం ధరలను ప్రభావితం చేసే ప్రధాన కారకాలు కూడా విస్తృతంగా మారాయని ఆయన వివరించారు.

ముప్పై సంవత్సరాల క్రితం వరకు బంగారం డిమాండ్‌లో ప్రధాన పాత్ర ఆభరణాలదే ఉండేది. అదే సమయంలో ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులు బంగారాన్ని నిల్వలో ఉంచడం కంటే విక్రయించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకోవడానికి భారీగా కొనుగోళ్లు చేస్తున్నాయి. ఈ కొనుగోళ్లు గ్లోబల్ మార్కెట్‌లో Gold ధరలకు మద్దతు ఇవ్వడంలో కీలకంగా మారాయి.
ఇప్పటి ప్రపంచ బంగారం మార్కెట్‌లో అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచ బంగారం వినియోగంలో 70 శాతం కంటే ఎక్కువ వాటా ఈ దేశాలదే. డిమాండ్ వనరులు కూడా విభిన్నంగా మారాయపి జైన్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ బంగారం డిమాండ్‌లో కేంద్ర బ్యాంకుల వాటా సుమారు 20 నుంచి 22 శాతం ఉండగా, పెట్టుబడిదారుల డిమాండ్ 40 నుంచి 42 శాతం వరకు ఉంది. ఆభరణాల డిమాండ్ దాదాపు 30 శాతం కాగా.. మిగిలిన 10 శాతం ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్లు, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు వంటి సాంకేతిక రంగాల నుంచి వస్తోంది.
గత రెండు సంవత్సరాలుగా బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ముఖ్యంగా 2024లో కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం ర్యాలీకి బలమైన పునాది వేసింది. 2025లో పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడంతో బంగారం ధరలు మరింతగా పెరిగాయి. ధరలు ఇప్పటికే గణనీయంగా పెరిగినా.. బంగారం పెట్టుబడిగా ఇంకా ఆకర్షణీయంగానే ఉందని జైన్ పేర్కొన్నారు.
బంగారం ధరలు పెరిగినప్పుడు చాలా మంది పెట్టుబడిదారులు ఇప్పుడు కొనడం సరైన సమయమా అనే సందేహం వ్యక్తం చేస్తారని ఆయన అన్నారు. ఉదాహరణగా, సుమారు 25 సంవత్సరాల క్రితం 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.4 వేలు మాత్రమే ఉండేదని గుర్తుచేశారు. అప్పట్లో కూడా చాలా మంది అది ఖరీదైనదే అని భావించేవారని ఆయన చెప్పారు.
భారతదేశంలో బంగారం డిమాండ్ పెరుగుతున్న ఆదాయాలతో దగ్గరగా సంబంధం కలిగి ఉందని జైన్ వివరించారు. భారతీయుల ఆదాయం లేదా సంపద 1 శాతం పెరిగితే, బంగారం డిమాండ్ దాదాపు 0.9 శాతం పెరుగుతుందని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడి డిమాండ్ బంగారం ధరల పెరుగుదల వెనుక ఉన్న ప్రధాన శక్తిగా నిలుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే స్వల్పకాలికంగా బంగారం ధరల కదలికలను ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని ఆయన అంగీకరించారు. ప్రపంచ రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారి, దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గి, ఆర్థిక స్థిరత్వం ఏర్పడితే మాత్రమే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
క్తుప్తంగా చెప్పాలంటే బంగారాన్ని తాత్కాలిక ట్రేడింగ్ సాధనంగా కాకుండా దీర్ఘకాలిక పెట్టుబడిగా చూడాలని జైన్ పెట్టుబడిదారులకు సూచించారు. ఒక పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో సుమారు 10 నుంచి 15 శాతం వరకు బంగారానికి కేటాయించడం ద్వారా పెట్టుబడుల సమతుల్యత, భద్రత మెరుగుపడుతుందని ఆయన చెప్పారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అస్థిరతల సమయంలో బంగారం "సేఫ్ హేవెన్" ఆస్తిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!



Click it and Unblock the Notifications