For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు తగ్గుతున్నాయ్: రూ.47,400 దిగువకు పసిడి, వెండి రూ.60,000 వద్ద

|

బంగారం ధరలు తగ్గుతున్నాయి. గత సోమవారం రూ.48,000 మార్కు పైన ప్రారంభమైన గోల్డ్ ఫ్యూచర్ ధరలు వారం ముగిసేసరికి రూ.600 వరకు క్షీణించి రూ.47,500 దిగువకు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల దిగువకు పతనమయ్యాయి. క్రితం వారం ఎంసీఎక్స్‌లో పసుపు లోహం పసిడి రెండు నెలల కనిష్టానికి పడిపోయింది. ఓ వైపు ఒమిక్రాన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నప్పటికీ, ఫెడ్ వడ్డీ రేటు పెరుగుతుందనే హింట్ నేపథ్యంలో పసిడి క్షీణిస్తోంది. బంగారం 2022 తొలి అర్ధ సంవత్సరంలో క్షీణించినప్పటికీ రెండో అర్ధ సంవత్సరంలో రూ.55,000కు పెరుగుతుందని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా.

ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8900 తక్కువగా..

ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8900 తక్కువగా..

నేటి సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.77 క్షీణించి రూ.47,375 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.94 క్షీణించి రూ.47,488 వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో దాదాపు రూ.8900 తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు స్వల్పంగా క్షీణించాయి. 4.60 డాలర్లు తగ్గి 1792.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో పోలిస్తే దాదాపు 285 డాలర్లు తక్కువగా ఉంది. ఏడాదిలో మూడు శాతానికి పైగా క్షీణించింది.

వెండి ధరలు

వెండి ధరలు

వెండి ధరలు నేడు స్వల్పంగా క్షీణించాయి. అయితే గత వారంలో మాత్రం దాదాపు రూ.2000 తగ్గింది. నేటి ప్రారంభ సెషన్‌లో మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.184 తగ్గి రూ.60,423 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.157 తగ్గి రూ.61,112 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.101 డాలర్లు తగ్గి 22.305 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఏడాదిలో పది శాతం కంటే పైగా తగ్గింది.

వివిధ నగరాల్లో ధరలు

వివిధ నగరాల్లో ధరలు

వివిధ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధరలు ఇలా ఉన్నాయి.ముంబైలో రూ.44,940, ముంబైలో రూ.46,620, ఢిల్లీలో రూ.46,770, కోల్‌కతాలో రూ.46,870, బెంగళూరులో రూ.44,320, హైదరాబాద్‌లో రూ.44,620, కేరళలో రూ.44,620, పుణేలో రూ.45,860, విజయవాడలో రూ.44,620, విశాఖపట్నంలో రూ.44,620గా ఉంది.

English summary

బంగారం ధరలు తగ్గుతున్నాయ్: రూ.47,400 దిగువకు పసిడి, వెండి రూ.60,000 వద్ద | Gold Prices Today: Gold rates fall to 2 Month low, Check the rate

The prices of gold fell sharply on Monday, falling from Rs 47,260 on January 4, 2022, to Rs 46,260 on January 10. On the MCX, the gold was trading at Rs 47,332, 0.25 per cent down from the previous day.
Story first published: Monday, January 10, 2022, 13:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X