బంగారం ధరలు భవిష్యత్తులో భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్దం ఇప్పట్లో ఆగే సూచనలు కనపడటం లేదు. రోజు రోజుకు పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. దీంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో తీవ్ర అనిశ్చితిని రేపుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు అలర్ట్ అవుతున్నారు. రిస్క్ ఉన్న ఆస్తుల నుంచి పెట్టుబడులను విరమించుకుని బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు.ఇప్పటికే అనేక కేంద్ర బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తుండగా, యుద్ధ ముప్పు మరింత పెరగడం వల్ల బంగారంపై డిమాండ్ గణనీయంగా పెరిగింది.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇంకా ఎగసే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్రమైతే లేదా దీర్ఘకాలంగా కొనసాగితే.. ఈ విలువైన లోహాలు చారిత్రాత్మక గరిష్ట స్థాయిలను తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సోమవారం జరిగిన MCX ట్రేడింగ్‌లో ఏప్రిల్ 2026 గడువు తేదీకి చెందిన బంగారం కాంట్రాక్ట్ ధర 10 గ్రాములకు రూ.5,811 పెరిగి రూ.1,67,915కు చేరుకుంది. అదే విధంగా, మార్చి 5, 2026 గడువు తేదీకి చెందిన వెండి కాంట్రాక్ట్ ధర కిలోకు రూ.9,492 పెరిగి రూ.2,84,490కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఒకే రోజులో సుమారు 2 శాతం పెరిగి నాలుగు వారాల గరిష్టాన్ని తాకుతూ ఔన్సుకు 5,329.39 డాలర్లకు చేరింది.
స్పాట్ వెండి కూడా 2 శాతం కంటే ఎక్కువ పెరిగి ఔన్సుకు 95డాలర్ల స్థాయిని దాటడం గమనార్హం. ఇప్పుడు పెట్టుబడిదారుల ముందున్న ప్రధాన ప్రశ్న ఏంటంటే.. వెండి మళ్లీ ఔన్సుకు 100 డాలర్ల స్థాయిని తాకుతుందా? అలాగే బంగారం 6,000 డాలర్ల మార్క్‌కు చేరుతుందా? అనే అంశమే. ఈ విషయంపై ప్రముఖ మార్కెట్ నిపుణులు కీలక అంచనాలు వెల్లడిస్తున్నారు.
జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కమోడిటీ రీసెర్చ్ హెడ్ హరీష్ మాట్లాడుతూ.. మార్కెట్ అస్థిరత పెరగడం, పెట్టుబడిదారుల్లో రిస్క్ భయం పెరగడం వల్ల స్వల్పకాలంలో బంగారానికి బలమైన మద్దతు లభిస్తుందని చెప్పారు. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైతే.. అంతర్జాతీయ మార్కెట్లో Gold ఔన్సుకు 6 వేల డాలర్ల వరకు చేరే అవకాశం ఉందని, అదే సమయంలో భారత మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.2 లక్షల దాకా వెళ్లవచ్చని ఆయన అంచనా వేశారు.
ఇండస్ఇండ్ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు జిగర్ త్రివేది అభిప్రాయం ప్రకారం.. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాలు ఇంధన సరఫరాలపై ప్రభావం చూపుతాయనే ఆందోళన పెట్టుబడిదారులను సురక్షిత ఆస్తుల వైపు నడిపిస్తోంది. దీని ఫలితంగా COMEX బంగారం ధరలు కొత్త గరిష్టాల దిశగా కదిలే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆయన అంచనా ప్రకారం COMEX బంగారం సమీప కాలంలో 5,500 డాలర్ల స్థాయిని, వెండి 100 డాలర్ల స్థాయిని పరీక్షించవచ్చు.
నిపుణుల మాటల్లో చెప్పాలంటే.. ప్రస్తుతం COMEX బంగారం ఔన్సుకు 5,300 డాలర్ల వద్ద కీలక నిరోధక స్థాయిని ఎదుర్కొంటోంది. ఈ స్థాయిని దాటితే భారత మార్కెట్లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.1,68,000 నుంచి రూ.1,70,000 మధ్య కదిలే అవకాశం ఉంది. అమెరికా-ఇరాన్ వివాదం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలా దీర్ఘకాలికంగా కొనసాగితే..బంగారం మునుపటి రికార్డు స్థాయిలను కూడా అధిగమించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వెండి విషయంలో కూడా బుల్లిష్ అంచనాలే వినిపిస్తున్నాయి. వెండి అంతర్జాతీయంగా 95 డాలర్ల పైన నిలదొక్కుకుంటే, మళ్లీ 100 డాలర్ల స్థాయిని తాకే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలా జరిగితే భారత మార్కెట్లో వెండి ధర కిలోకు రూ.3 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్లుప్తంగా చూసినట్లయితే.. ప్రస్తుత ఉద్రిక్తతలు స్వల్పకాలంలో బంగారం, వెండి ధరలకు బలమైన మద్దతునిస్తున్నాయి. అయితే ఈ ర్యాలీ తాత్కాలికమా, లేక దీర్ఘకాలిక బుల్ల్ ట్రెండ్‌కు నాందియా అన్నది పూర్తిగా అమెరికా-ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం తీవ్రత మరియు వ్యవధిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications