For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price Today: జీవితకాల గరిష్ఠానికి బంగారం.. బడ్జెట్ పరుగులు.. కొనాలా..? మానాలా..?

|

Gold Price Today: భారతీయులకు బంగారం, వెండి, వజ్రాలు వంటి విలువైన వస్తువులంటే ఎంత ప్రేమో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఏ చిన్న అవకాశం దొరికినా గోల్డ్ కొని దాచుకోవాలని భావిస్తుంటారు. అయితే ఈరోజు కేంద్ర వార్షిక బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం, వెండి పై దిగుమతి సుంఖం పెంచనున్నట్లు ప్రకటించారు.

నేడు బంగారం ధర..

నేడు బంగారం ధర..

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో నేడు బంగారం ధర 10 గ్రాములకు రూ.58,060 స్థాయికి చేరుకుంది. పార్లమెంటులో ఆర్థిక మంత్రి తన ప్రసంగాన్ని ముగించే సమయానికి రికార్డు స్థాయికి చేరుకుంది. బంగారం, ప్లాటినం వంటి ‌విలువైన లోహాలతో వెండి డోర్, వెండి కడ్డీలు, వెండి వస్తువుల ధరను స‍మనం చేసేందుకు దిగుమతి సుంకాన్ని పెంచాలని నిర్ణయించినట్లు నిర్మలా సీతారామన్ ప్రటించారు. దీంతో గోల్డ్, వెండి ధరలు రికార్డు గరిష్ఠాలకు చేరుకున్నాయి.

బ్రోకరేజ్ సంస్థ..

బ్రోకరేజ్ సంస్థ..

కేంద్ర ‌ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచాలని తీసుకున్న నిర్ణయం వల్ల బంగారం, వెండి వినియోగం కొంత తగ్గుతుందని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ కమోడిటీ రీసెర్చ్ అనలిస్ట్ నిర్పేంద్ర యాదవ్ అన్నారు. ఇది రూపాయి బలోపేతం కావటానికి దోహదపడటంతో పాటు విలువైన విదేశీ మారక నిల్వలను మెరుగ్గా నిర్వహించేందుకు సహాయపడుతుందని ఆయన అన్నారు. బడ్జెట్ తాజా నిర్ణయం వల్ల బులియన్ మార్కెట్లో పాల్గొనే వారి సంఖ్య తగ్గుతుందని ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా అభిప్రాయపడ్డారు. బంగారం ధర సమీప కాలంలో రూ.60,000 స్థాయికి చేరుకుంటుందని ఆయన తెలిపారు.

బంగారం ధరలు..

బంగారం ధరలు..

ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో రూ.59,105గా ఉంది. విశాఖలో రూ.59,190, ముంబైలో రూ.59,040, చెన్నైలో 59,260, దేశ రాజధాని దిల్లీలో రూ.59,270గా ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో రూ.52,750, విశాఖలో రూ.52,750, చెన్నైలో రూ.54,150, దిల్లీలో రూ.52,900గా ఉన్నాయి.

English summary

Gold Price Today: జీవితకాల గరిష్ఠానికి బంగారం.. బడ్జెట్ పరుగులు.. కొనాలా..? మానాలా..? | Gold prices reached all time high amid FM raised import duty in budget 2023

Gold prices reached all time high amid FM raised import duty in budget 2023
Story first published: Wednesday, February 1, 2023, 15:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X