For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అయోమయంగా బంగారం ధరలు.. 60వేలకు పెరుగుతుందా? నేడు తెలుగురాష్ట్రాల్లో కాస్త తగ్గిన ధరలిలా!!

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులతో బంగారం ప్రియులు అయోమయానికి గురవుతున్నారు. 60 వేల వరకు బంగారం పెరగవచ్చని చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

|

భారతదేశంలో అత్యధికంగా ప్రజలందరూ ఇష్టపడి కొనుగోలు చేసే బంగారం ధరలు ఊగిసలాడుతున్నాయి. నిత్యం హెచ్చుతగ్గులతో కొనుగోలుదారులను సందిగ్ధంలో పడేస్తున్నాయి. నాలుగు రోజులు బంగారం ధరలు తగ్గితే, మరో నాలుగు రోజులు బంగారం ధరలు పెరుగుతున్న తీరు బంగారం ప్రియులను ఆందోళనకు గురిచేస్తుంది. అయితే ప్రస్తుతం బంగారం ధరల సరళిని బట్టి మళ్లీ బంగారం ధరలు కొండెక్కి కూర్చునే అవకాశం లేకపోలేదని చర్చ జరుగుతుంది.

మళ్లీ బెంబేలెత్తిస్తున్న బంగారం ధరలు.. ఈరోజు తెలుగురాష్ట్రాల్లో పసిడిధరలు ఎంతగా పెరిగాయంటే!!మళ్లీ బెంబేలెత్తిస్తున్న బంగారం ధరలు.. ఈరోజు తెలుగురాష్ట్రాల్లో పసిడిధరలు ఎంతగా పెరిగాయంటే!!

మళ్ళీ 60 వేలకు బంగారం ధర చేరుకునే అవకాశం

మళ్ళీ 60 వేలకు బంగారం ధర చేరుకునే అవకాశం

అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగాను బంగారం ధరలలో హెచ్చుతగ్గులు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మళ్ళీ బంగారం ధరలు 60 వేలకు చేరుకుంటాయన్న భావన కూడా నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి మారకం విలువ మార్పు, ద్రవ్యోల్బణం, వాణిజ్య యుద్ధాలు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు, అంతర్జాతీయంగా బంగారం నిల్వలు ఇలా అనేక అంశాలు బంగారం పెరుగుదలకు కారణంగా మారుతున్నాయి.

హైదరాబాద్ లో నేడు బంగారం ధరలు ఇలా

హైదరాబాద్ లో నేడు బంగారం ధరలు ఇలా

ఇక తాజాగా నేడు బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్లో నిన్న 53, 150 రూపాయలుగా విక్రయమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు వంద రూపాయలు తగ్గి 53,050 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,980గా నిన్న ట్రేడ్ కాగా నేడు 57,870లుగా కొనసాగుతుంది. నిన్నటితో పోలిస్తే స్వచ్ఛమైన బంగారం మీద 110 రూపాయలు బంగారం ధర నేడు తగినట్టు కనిపిస్తుంది.

 ఢిల్లీ, ముంబైలలో బంగారం ధరలు ఇలా

ఢిల్లీ, ముంబైలలో బంగారం ధరలు ఇలా

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 53,300గా ట్రేడ్ కాగా నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53,200గా ప్రస్తుతం కొనసాగుతుంది. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 58 వేల 130 రూపాయలుగా విక్రయం కాగా నేడు 58,020 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53,150 రూపాయలుగా కొనసాగితే, నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53,050 ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ముంబైలో నిన్న 57,980గా ట్రేడ్ కాగా నేడు 57,870 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.

విజయవాడ, విశాఖలతో పాటు బెంగళూరు, చెన్నైలలో బంగారం ధరలిలా

విజయవాడ, విశాఖలతో పాటు బెంగళూరు, చెన్నైలలో బంగారం ధరలిలా

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53, 050 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,870 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. బెంగళూరులో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 53,100 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం బెంగుళూరులో 57,920 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఇక దేశంలోనే బంగారం ధరలలో అత్యధికంగా ధరలు ఉండే చెన్నై, మధురై, కోయంబత్తూరులలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 53,800 కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 58,690 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.

English summary

అయోమయంగా బంగారం ధరలు.. 60వేలకు పెరుగుతుందా? నేడు తెలుగురాష్ట్రాల్లో కాస్త తగ్గిన ధరలిలా!! | gold prices may rise to 60 thousand? these are the gold rates today in Telugu states!!

Gold lovers are confused by the fluctuations in gold prices. there is a talk that gold may rise to 60 thousand. these are the gold rates today in Telugu states.
Story first published: Wednesday, March 15, 2023, 12:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X