For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడేళ్లలో ఓ వారంలో తొలిసారి భారీగా బంగారం తగ్గుదల, నేడు మాత్రం...

|

న్యూఢిల్లీ: బంగారం ధరలు సోమవారం (నవంబర్ 11) స్వల్పంగా పెరిగాయి. అమెరికా - చైనా వాణిజ్య చర్చలపై సందిగ్ధత నేపథ్యంలో ఉదయం ట్రేడింగ్ సమయంలో గోల్డ్ ఫ్యూచర్స్ మిశ్రమ సంకేతాలు కనిపించాయి. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ ఉదయం గం.9.20 సమయానికి 10 గ్రాములు రూ.37,690 వద్ద ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్లో ఇది రూ.37,687 వద్ద క్లోజ్ అయింది.

గత మూడేళ్లలో ఎప్పుడూ తగ్గనంత బంగారం, వెండి ధరలు గత వారం తగ్గాయి. ఓ వారంలో భారీగా ధరలు తగ్గడం మూడేళ్లలో మొదటిసారి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1458 డాలర్లుగా ఉంది. వెండి 16.80 డాలర్లుగా ఉంది.

బంగారం కొనుగోళ్ళకు దూరం దూరం... ఎందుకో తెలుసా?బంగారం కొనుగోళ్ళకు దూరం దూరం... ఎందుకో తెలుసా?

Gold prices fall to lowest in three months, silver rates slide

కాగా, బంగారం ధర ఆదివారం భారీగా తగ్గింది. హైదరాబాదులో సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.39,600కు చేరుకుంది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్‌కు తోడు దేశీయ జ్యువెల్లర్స్ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించింది. దీంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడింది. 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.36,300కు దిగొచ్చింది. ఢిల్లీ మార్కెట్లోను బంగారం ధర దాదాపు అంతే తగ్గింది.

English summary

మూడేళ్లలో ఓ వారంలో తొలిసారి భారీగా బంగారం తగ్గుదల, నేడు మాత్రం... | Gold prices fall to lowest in three months, silver rates slide

Gold futures rose in early trade on November 11 as mixed signals from US-China trade talks kept investors cautious, thus boosting demand for safe-haven buying.
Story first published: Monday, November 11, 2019, 13:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X