For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గిన బంగారం ధరలు, వారం రోజుల కనిష్టానికి....

|

బంగారం ధరలు నేడు భారీగా క్షీణించాయి. వెండి ధరలు మాత్రమే స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ ఏకంగా 1870 డాలర్ల దిగువకు పడిపోయాయి. వెండి ఔన్స్ 28 డాలర్ల పైన ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.7700 తక్కువగా ఉంది. భారత్‌లో కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ వేగవంతం కావడంతో ఈక్విటీ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఈక్విటీ వైపు చూస్తున్నారు. దీంతో పసిడి పైన ఒత్తిడి తగ్గింది. వారం రోజుల కనిష్టానికి పసిడి ధరలు తగ్గాయి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో రూ.356.00 (0.73%) క్షీణించి రూ.48547.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,750.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,750.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,105.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.364.00 (0.74%) తగ్గి రూ.48861.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,900.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,990.00 గరిష్టాన్ని, రూ.48,473.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.300 డౌన్

రూ.300 డౌన్

జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.292.00 (-0.40%) క్షీణించి రూ.71935.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,000.00 వద్ద ప్రారంభమై, రూ.72,094.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.70,933.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.253.00 (0.34%) తగ్గి రూ.73118.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.73,000.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.73,282.00 గరిష్టాన్ని, రూ.72,080.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 14.25 (0.76%) డాలర్లు తగ్గి 1,865.25 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,846.20 - 1,879.75 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ తగ్గింది. 0.088 (0.31%) డాలర్లు తగ్గి 28.058 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.567 - 28.157 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

తగ్గిన బంగారం ధరలు, వారం రోజుల కనిష్టానికి.... | Gold prices dips today, Hits one week low

Yellow metal may remain under pressure amid firmer US dollar however a sharp fall is unlikely as Fed is likely to maintain a dovish stance.
Story first published: Monday, June 14, 2021, 21:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X