For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price today: రూ.47,000 దాటిన బంగారం, రూ.70,000 క్రాస్ చేసిన వెండి

|

బంగారం, వెండి ధరలు నేడు భారీగా పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం రూ.200 వరకు పెరగగా, వెండి రూ.700 వరకు పెరిగి రూ.70,000 దాటి పరుగులు పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి 1800 డాలర్ల దిశగా వెళ్తోంది. వెండి 27 డాలర్లకు సమీపంలో ఉంది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో బంగారం రూ.9000 తక్కువగా ఉంది. గత నెలలో ఓ సమయంలో రూ.12000కు పైగా కూడా తగ్గింది. ఈ కాలంలో పసిడి రూ.3000కు పైగా పెరిగింది.

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.190.00 (0.40%) పెరిగి రూ.47190.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,072.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,263.00 గరిష్టాన్ని, రూ.47,055.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.175.00 (0.37%) పెరిగి రూ.47505.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,435.00 వద్ద ప్రారంభమై, రూ.47,600.00 గరిష్టాన్ని, రూ.47,419.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.70వేల పైకి పసిడి

రూ.70వేల పైకి పసిడి

వెండి ఫ్యూచర్ ధరలు నేడు పెరిగాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.681.00 (0.98%) పెరిగి రూ.70300.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,692.00 వద్ద ప్రారంభమై, రూ.70,496.00 గరిష్టాన్ని, రూ.69,651.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.787.00 (1.11%) పెరిగి రూ.71385.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,781.00 ప్రారంభమైన ధర, రూ.71,456.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,738.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 1800 డాలర్ల సమీపంలోకి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 8.15 (0.46%) డాలర్లు పెరిగి 1,792.45 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,781.90 - 1,795.65 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగింది. 0.211 (0.80%) డాలర్లు పెరిగి 26.730 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.247 - 26.902 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

Gold price today: రూ.47,000 దాటిన బంగారం, రూ.70,000 క్రాస్ చేసిన వెండి | Gold price today: Yellow metal shines amid experts bullish tag

Gold price today at the Multi Commodity Exchange (MCX) opened ₹120 higher from its yesterday closing and hit ₹47,120 per 10 gm. The yellow metal had managed to close on the higher side yesterday too but these shines in the yellow metal is still not enough to pare the gap of near ₹9,000 between the current gold price and its all-time high of ₹56,191.
Story first published: Thursday, May 6, 2021, 15:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X