For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్: రూ.50,000 దిగువకు... భారీగా తగ్గిన బంగారం ధరలు

|

బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గాయి. బంగారం 2020 ఆగస్ట్ నెలలో ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200కు చేరుకుంది. అయితే ఆ తర్వాత 44,000 దిగువకు చేరుకున్నప్పటికీ, కరోనా సెకండ్, థర్డ్ వేవ్ ఆ తర్వాత రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పసిడి ధరలు మళ్లీ రూ.55,000 స్థాయికి చేరుకున్నాయి. కానీ ఇటీవల మళ్లీ భారీగా తగ్గాయి. గత నెలలో రూ.53,000 పైన పలికిన గోల్డ్ ఫ్యూచర్స్ ఈ కాలంలోనే రూ.3000కు పైగా తగ్గి రూ.50,000 దిగువకు చేరుకోవడం గమనార్హం.

పసిడికి డాలర్ దెబ్బ

పసిడికి డాలర్ దెబ్బ

గోల్డ్ ఫ్యూచర్స్ చాలా రోజుల తర్వాత రూ.50,000 దిగువకు వచ్చింది. అలాగే వెండి ఫ్యూచర్స్ కూడా రూ.60,000 దిగువకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం 2075తో పోలిస్తే 262 డాలర్లు తక్కువగా, సిల్వర్ ఫ్యూచర్స్ 22 డాలర్ల దిగువకు పడిపోయింది. డాలర్ వ్యాల్యూ అంతకంతకూ పెరుగుతుండటం పసిడి ధర పైన ప్రభావం చూపుతోంది. డాలర్ దెబ్బతో పసిడి మూడు నెలల కనిష్టానికి పడిపోయింది.

దేశీయ ఫ్యూచర్ మార్కెట్

దేశీయ ఫ్యూచర్ మార్కెట్

గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.265 క్షీణించి రూ.49,909 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.335 తగ్గి రూ.50,078 వద్ద ముగిసింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.631 పెరిగి రూ.59,382 వద్ద ముగిసినప్పటికీ, అంతకుముందు సెషన్‌లో రూ.59,000 దిగువకు పడిపోయింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.591 పెరిగి రూ.60,073 వద్ద ముగిసింది.

కామెక్స్‌లో...

కామెక్స్‌లో...

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 14.30 డాలర్లు క్షీణించి 1810 డాలర్ల వద్ద ముగిసింది. అంతకుముందు సెషన్‌లో 1824 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 0.75 శాతం క్షీణించింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.352 డాలర్లు పెరిగి 21.125 డాలర్ల వద్ద ముగిసింది. క్రితం సెషన్‌లో 20.773 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 21.93 డాలర్ల మేర క్షీణించింది.

English summary

గుడ్‌న్యూస్: రూ.50,000 దిగువకు... భారీగా తగ్గిన బంగారం ధరలు | Gold price today: Dollar continues to drag yellow metal rate

On account of dollar index surging to fresh two decades high, gold price continued its losing streak for fourth straight week. At Multi Commodity Exchange (MCX), gold rate on Friday closed at ₹49,909 per 10 gm, logging weekly loss of around 2.86 per cent.
Story first published: Saturday, May 14, 2022, 15:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X