For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold loan: బంగారం రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులో 50% మాఫీ

|

ఎవరైనా రుణాలు తీసుకోవాలనుకుంటే పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ వంటి వాటిని పరిశీలిస్తారు. పర్సనల్ లోన్ అన్-సెక్యూర్డ్ రుణం కాబట్టి వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. గోల్డ్ లోన్ సెక్యూర్డ్ రుణం. కాబట్టి వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. 18 క్యారెట్ల బంగారం నుండి 24 క్యారెట్ల బంగారం వరకు రుణం పొందడానికి రుణదాత వద్ద తనఖా పెడతారు. గోల్డ్ లోన్‌లు సాధారణంగా ఇతర టర్మ్ లోన్స్‌తో పోలిస్తే తక్కువ వడ్డీ రేటును కలిగి ఉంటాయి. అవి వేగవంతమైన ప్రాసెసింగ్ ఫీజు, సౌకర్యవంతమైన రీపెమెంట్ ఆప్షన్స్‌ను కలిగి ఉంటాయి. అతిపెద్ద ప్రభుత్వరంగ రుణదాత ఎస్బీఐ గోల్డ్ లోన్ పైన 50 శాతం ప్రాసెసింగ్ ఫీజును తగ్గించింది.

ఈ మేరకు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. బంగారంపై రుణాలకు ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. వేగవంతమైన రుణం మంజూరు చేయ‌డంతో పాటు మీకు వెసులుబాటుతో కూడిన రీపేమెంట్ విధానాన్ని ఎంచుకునేందుకు ఎస్బీఐ అనుమ‌తి ఇస్తోంది. ఎస్బీఐ అనుబంధ యోనో యాప్ ద్వారా తేలికగా బంగారం తాక‌ట్టు రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

 Gold loan: SBI offers 50 percent waiver on processing fees

పద్దెనిమిదేళ్ళు దాటి, నిరంత‌ర ఆదాయం పొందుతున్న వారు ఎవరైనా బంగారంపై రుణాలు తీసుకోవ‌చ్చు. పెన్ష‌నర్లు ప‌సిడిపై లోన్ తీసుకునేందుకు అనుమ‌తిస్తున్నారు. క‌నీసం రూ.20 వేల నుండి గ‌రిష్ఠంగా రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం పొందవచ్చు. లోన్ తీసుకునేవారు తాము తాకట్టు పెట్టే బంగారం నాణ్యత, పరిమాణం చెక్ చేసుకున్న తర్వాత బ్యాంకు అధికారులకు అప్పగించాలి. బంగారంపై రుణాలకు 0.25 శాతం లేదా రూ.250 జీఎస్టీ ఉంటుంది.

English summary

Gold loan: బంగారం రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులో 50% మాఫీ | Gold loan: SBI offers 50 percent waiver on processing fees

A gold loan is a secured form of loan that a lender offers. Borrowers keep their gold ranging from 18 carats to 24 carats with the lender for availing capital.
Story first published: Tuesday, May 31, 2022, 9:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X