For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారానికి ముఖం చాటేస్తున్న జనం.. పడిపోయిన కొనుగోళ్లు.. కారణం ఇదే..

|

దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు మండిపోతుండటంతో కొనుగోలుదారులు ముఖం చాటేయడం ట్రేడ్ వర్గాల్లో ప్రస్తుతం విపరీతమైన చర్చ జరుగుతున్నది. బంగారం కొనుగోలుదారులను ఆకర్షించేందుకు మార్కెట్లలో భారీ రేంజ్‌లో డిస్కౌంట్ ఆఫర్లు కుప్పలుతెప్పలుగా కనిపిస్తున్నాయి. పండుగ సీజన్ తర్వాత బంగారం అమ్మకాలు భారీగా క్షీణించడంతో కొనుగోలు దారులను ఆకర్షించే పనిలో పడినట్టు ట్రేడర్లు తెలుస్తున్నది.

 మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు

పండుగ సీజన్ పూర్తికావడంతో

పండుగ సీజన్ పూర్తికావడంతో

గతవారం దీపావళీ, ధన్ తెరాస్ శుభ దినాలు కావడం, బలమైన సెంటిమెంట్‌ కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత మార్కెట్లలో కొనుగోలు వ్యవహారాల్లో స్తబ్దత చోటుచేసుకొన్నది. ఈ అంశంపై ట్రేడ్ వర్గాలు స్పందిస్తూ.. ఉన్నట్టుంది ఈ వారం బంగారం ధరల్లో రికవరీ లేకపోవడం వల్ల అమ్మకాలు తగ్గాయి. అయితే ధరల పెరుగుదల కారణంగా గత ఏడాది కంటే ప్రస్తుతం డిమాండ్ తగ్గింది. కానీ మా అంచనాలు మించాయి అని పేర్కొంటున్నారు.

కొంత ఉపశమనం

కొంత ఉపశమనం

బులియన్ మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాముల ధర గోల్డ్ ఫ్యూచర్‌లో రూ.38500 వద్ద ట్రేడ్ అయింది. సెప్టెంబర్‌లో రూ.39885 నమోదైన రికార్డు ధర తర్వాత కాస్త క్షీణించడం కొనుగోలు దారులకు ఉపశమనం కలిగింది. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం బంగారం ధరలు 22 శాతం మేర పెరిగాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

 క్షీణించిన అమ్మకాలు

క్షీణించిన అమ్మకాలు

ధన త్రయోదశి (ధన్ తెరస్) సందర్భంగా 30 టన్నుల మేర అమ్మకాలు జరిగాయనేది తాజా రిపోర్టు. అయితే ధర పెరగడం వల్ల సాధారణం కంటే 25 శాతం మేర అమ్మకాలు క్షీణించాయనే విషయాన్ని ఇండియన్ బులియన్ అండ్ జ్యువల్లరీ అసోసియేషన్ వెల్లడించింది. అయినప్పటికీ బంగారం నిల్వ చేసుకోవడంలో ట్రేడర్ల ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదనే విషయం వెలుగులోకి వచ్చింది.

 బలహీనంగా సెంటిమెంట్

బలహీనంగా సెంటిమెంట్

బంగారం ధరలకు సంబంధించి కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. వినియోగదారుల్లో కొనుగోలు సెంటిమెంట్ బలహీనంగా ఉంది. ఇంకా 30 శాతం మేర ధరలో మార్పులు వస్తే మళ్లీ కొనుగోళ్లు ఊపందుకొనే అవకాశం ఉంటుంది. రికార్డు ధర నుంచి కొంత మేరకు దిగివచ్చింది. మా వంతుగా హోల్‌సేల్‌గా కొనుగోళ్లు చేపడుతున్నాం అని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

English summary

బంగారానికి ముఖం చాటేస్తున్న జనం.. పడిపోయిన కొనుగోళ్లు.. కారణం ఇదే.. | Gold demand falls after Dhanteras, Diwali season

India gold demand falls after Dhanteras and Diwali festival. 2019 Sales are below expectation to last year.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X