For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ వృద్ధి మైనస్ 7.2 శాతం, 1997 నుండి దారుణ పతనం

|

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ వృద్ధి రేటు 2020 క్యాలెండర్ ఇయర్ రెండో క్వార్టర్‌లో దారుణంగా పతనమైంది. ప్రపంచ రియల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (GDP) గత ఏడాదితో పోలిస్తే 7.2 శాతం మేర క్షీణించింది. 1997 నుండి అత్యంత వరస్ట్ పతనం. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 39 దేశాల ఆర్థిక వ్యవస్థ విశ్లేషణను చూపిస్తోంది. ఇందులో 19 యూరో దేశాలు ఉన్నాయి. 94 శాతం అభివృద్ధి చెందిన దేశాలు, 73 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయి.

చివరలో మురిసిన ఇన్వెస్టర్లు: అమెరికా ఎఫెక్ట్, భారీ నష్టాలతో భారీ కొనుగోళ్లు..చివరలో మురిసిన ఇన్వెస్టర్లు: అమెరికా ఎఫెక్ట్, భారీ నష్టాలతో భారీ కొనుగోళ్లు..

అభివృద్ధి చెందిన దేశాల రియల్ జీడీపీ 11 శాతం మేర క్షీణించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 14 శాతం మేర క్షీణించింది. ఇందులో చైనాకు మాత్రమే మినహాయింపు ఉంది. చైనా వృద్ధి రేటు పాజిటివ్‌గా ఉంది. 2020 క్యాలెండర్ ఏడాది రెండో క్వార్టర్‌లో వృద్ధిని నమోదు చేసిన 39 దేశాల్లో కేవలం చైనా మాత్రమే ఉంది.

 Global GDP shrinks 7.2 percent in Q2 2020

ఇక, గ్లోబల్ రియల్ ప్రయివేట్ కన్సంప్షన్ ఎక్స్‌పెండిచర్ (PFCE) రికార్డ్ స్థాయిలో రెండో క్వార్టర్‌లో 11 శాతం మేర క్షీణించింది. రియల్ గ్రాస్ కాపిడల్ ఫార్మేషన్ (GCF) కేవలం 6 శాతం పడిపోయింది. రియల్ గవర్నమెంట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్‌పెండిచర్(GFCE) స్థిరంగా ఉంది. కరోనా కారణంగా లాక్ డౌన్, సామాజిక దూరం వంటి వివిధ కారణాలతో PFCE రికార్డు క్షీణత ఆశ్చర్యం కలిగించలేదు. చైనాలో మైనస్ 2.9 శాతం నుండి సింగపూర్‌లో మైనస్ 28 శాతం వరకు 39 దేశాల్లో క్షీణత నమోదయింది. అదే సమయంలో భారీ ఆర్థిక ఉద్దీపన నేపథ్యంలో రియల్ GFCE పెరుగుదల ఉంది.

English summary

ప్రపంచ వృద్ధి మైనస్ 7.2 శాతం, 1997 నుండి దారుణ పతనం | Global GDP shrinks 7.2 percent in Q2 2020

GDP contracted 7.2 per cent in the second quarter of 2020 from year-ago period. This was the worst fall since 1997, shows an analysis of 39 nations by Motilal Oswal Financial Services.
Story first published: Friday, September 25, 2020, 21:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X