For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Covid pandemic: 2020లో 32 ట్రిలియన్ డాలర్లు పెరిగిన ప్రపంచ రుణాలు

|

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దారుణంగా క్షీణించింది. కరోనా, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం నేపథ్యంలో 2020 క్యాలెండర్ ఏడాదిలో ప్రపంచ రుణాలు 32 ట్రిలియన్ డాలర్ల మేర పెరిగి 290.6 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. ఆఫ్రికా, కరేబియన్ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఉత్పాదకత వృద్ధి కుంగిపోవడంతో ఆయా దేశాల రుణ చెల్లింపు సామర్థ్యంపై తీవ్రమైన పభావం పడిందని పేర్కొంది. అలాగే అభివృద్ధి చెందిన దేశాలకు ఉత్పాదకత, మానవ వనరులపరమైన ఇబ్బందులు రుణాలు చెల్లించే సామర్థ్యానికి సవాల్‌గా మారినట్లు తెలిపింది.

బిట్ కాయిన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? కాస్త ఆగండి!బిట్ కాయిన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? కాస్త ఆగండి!

రుణ సేవలపై ప్రభావం

రుణ సేవలపై ప్రభావం

మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ తాజా నివేదికలో ప్రపంచ రుణ రేటు పెరిగినట్లు తెలిపింది. ఉత్పాదకత వృద్ధిలో నిరంతర క్షీణత, ఆఫ్రికా, కరేబియన్‌తో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో రుణాలు భారీగా పెరిగినట్లు తెలిపింది. డిఫాల్ట్‌లలో పెరుగుదల ఉన్నప్పటికీ, విధాన మద్దతు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో రుణ సంక్షోభాన్ని నిరోధించినట్లు వెల్లడించింది. అయితే కరోనా మహమ్మారి, దాని తదనంతర పర్యావసనాలు రుణ సేవల సామర్థ్యంపై ప్రభావం మాత్రం చూపుతాయని తెలిపింది.

ఫిస్కల్ స్పేస్

ఫిస్కల్ స్పేస్

అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలకు ఫిస్కల్ స్పేస్ ఉందని, కానీ ఉత్పాదకత, జనాభా సవాళ్లుగా మూడీస్ పేర్కొంది. కరోనా మహమ్మారి అనంతరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికాలో రికవరీ కనిపిస్తుండగా, సేవలపై ఆధారపడిన దక్షిణ యూరోపియన్ ఆర్థిక వ్యవస్థలు వెనుకబడి ఉన్నాయని పేర్కొంది. నిరర్థక రుణాలు పెరిగినప్పటికీ, బ్యాంకింగ్ వ్యవస్థలు బలమైన క్యాపిటలైజేషన్ నిష్పత్తులతో మహమ్మారిలోకి ప్రవేశించాయని తెలిపింది.

పునరుత్తేజం గందరగోళం

పునరుత్తేజం గందరగోళం

కరోనా సంక్షోభం నుండి ప్రపంచ దేశాల పునరుత్తేజం గందగోళంగా ఉండనుందని మూడీస్ అభిప్రాయపడింది. నిరర్థక రుణాలు పెరిగినప్పటికీ, ఇప్పటికే సరిపడా ఆర్థిక వనరులు సమకూర్చుకున్న బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్ఠంగా నిలవనుందని పేర్కొంది. మొత్తం రుణాల్లో ప్రభుత్వ వాటా 2020 నాలుగో త్రైమాసికం నాటికి ప్రపంచ జీడీపీలో 105 శాతానికి ఎగబాకిందని వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రభుత్వాల రుణాలు ఈస్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి అని తెలిపింది.

English summary

Covid pandemic: 2020లో 32 ట్రిలియన్ డాలర్లు పెరిగిన ప్రపంచ రుణాలు | Global debt rises $32 trillion in 2020 amid Covid pandemic: Moody's

The Covid-19 pandemic and its aftermath has pushed the global debt higher by $32 trillion in 2020 to $290.6 trillion led by government and non-financial corporate debt, and will continue to rise in 2021, said a latest release by Moody's Investor Service (Moody's).
Story first published: Tuesday, June 8, 2021, 15:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X