For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్బీఐ సహా 9 బ్యాంకుల రేటింగ్ తగ్గింపు, ప్రభుత్వం మరో ప్యాకేజీ

|

అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ భారత్‌కు చెందిన పలు బ్యాంకులు, సంస్థల రేటింగ్‌ను తగ్గించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్యాకేజీ ప్రకటించే అవకాశముందని తెలిపింది. గాల్వాన్‌లో చైనాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో రీఫామ్స్ పైన ప్రభావం పడవచ్చునని, కానీ భారత క్రెడిట్ ప్రొఫైల్‌ను మాత్రం ప్రభావితం చేయదని తెలిపింది.

అలా గాయపరచకండి: మనసును కదిలించే రతన్ టాటా పోస్ట్, బాలీవుడ్ నటి సహా ఎందరో ఫిదా!అలా గాయపరచకండి: మనసును కదిలించే రతన్ టాటా పోస్ట్, బాలీవుడ్ నటి సహా ఎందరో ఫిదా!

ఈ బ్యాంకుల రేటింగ్ తగ్గించిన ఫిచ్

ఈ బ్యాంకుల రేటింగ్ తగ్గించిన ఫిచ్

ఫిచ్ రేటింగ్స్ భారత్‌కు చెందిన తొమ్మిది బ్యాంకుల రేటింగ్స్‌ను తగ్గించింది. కరోనా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ప్రతికూలతను ఎదుర్కొంటుందనే అంచనాలతో ఈ చర్య చేపట్టింది. ఈ బ్యాంకులకు గతంలోని స్థిరత్వం నుండి నెగిటివ్‌కు మార్చింది ఫిచ్ రేటింగ్స్. రేటింగ్ తగ్గిన బ్యాంకుల్లో... ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా (న్యూజిలాండ్) కూడా ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకుల రేటును కూడా తగ్గించింది.

వీటిని నెగిటివ్‌గా

వీటిని నెగిటివ్‌గా

ఫిచ్ ఎయిర్‌టెల్ రేటింగ్‌ను కూడా స్థిరత్వం నుండి నెగిటివ్‌కు సవరించింది. దీని దీర్ఘకాలిక విదేశీ కరెన్సీ ఇష్యూయర్ డిఫాల్ట్ రేటింగ్ BBB-గా మార్చింది. ఫిచ్ ఔట్‌లుక్‌ను అదానీ ట్రాన్స్‌మిషన్‌ను నెగిటివ్‌కు సవరించింది.

మరో ప్యాకేజీ

మరో ప్యాకేజీ

కరోనా మహమ్మారి వల్ల అతలాకుతలమవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం మరో ఉద్దీపన చర్య ప్రకటించే అవకాశం ఉందని ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ సోమవారం తెలిపింది. ఈసారి జీడీపీలో దాదాపు 1 శాతం ఉండవచ్చునని అంచనా వేసింది. భారత సార్వభౌమ రేటింగ్ ఐట్‌లుక్‌‌ను ఫిచ్ గతవారం స్టేబుల్ నుంచి నెగటివ్‌కు తగ్గించింది. ఈ క్రమంలో అదనంగా ప్రకటించబోయే ఉద్దీపనలను కూడా పరిగణనలో తీసుకున్నట్లు ఫిచ్ డైరెక్టర్ (సావరీన్ రేటింగ్స్) థామస్ రూక్మాకర్ తెలిపారు. భారత్ జీడీపీలో 10% స్థాయిలో ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిందని, ఇందులో ద్రవ్యపరమైన చర్యలు జీడీపీలో 1 శాతం ఉంటాయని పేర్కొంది.

స్వల్పకాలిక వృద్ధి రేటు

స్వల్పకాలిక వృద్ధి రేటు

స్వల్పకాలిక భారత వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన 6.5%-7% కన్నా మరికాస్త తక్కువగానే ఉండవచ్చని తెలిపారు. మధ్యకాలికంగా భారత వృద్ధి అంచనాలు ఊహించిన దానికన్నా కాస్త తక్కువగానే ఉండవచ్చునని, ఎంత స్థాయిలో తగ్గవచ్చుననేది మాత్రం ఇప్పుడే చెప్పలేమన్నారు. రుణాల చెల్లింపులపై విధించిన మారటోరియం ఎత్తివేశాక ఆర్థిక రంగ సంస్థల పరిస్థితి ఎలా ఉంటుందనే దాని ఆధారంగా మరిన్ని అంశాలు తెలుస్తాయన్నారు. రాబోయే రోజుల్లో వృద్ధిని మెరుగుపర్చుకునేందుకు సంస్కరణలు ఊతం ఇవ్వనున్నప్పటికీ, వ్యాపార ఆర్థిక రంగాలపై కరోనా ప్రభావం మీద ఇది ఆధారపడి ఉంటుందన్నారు.

English summary

ఎస్బీఐ సహా 9 బ్యాంకుల రేటింగ్ తగ్గింపు, ప్రభుత్వం మరో ప్యాకేజీ | Galwan impact on Reforms, Fitch revises outlook of 9 Indian banks to Negative

Fitch Ratings has revised the outlook on the Long Term Issuer Default Ratings (IDR) of nine Indian banks to Negative from Stable. This is on account of the impact of the escalating coronavirus pandemic on India's economy. This follows Fitch's India outlook rating revision on the BBB- rating to Negative from Stable on June 18.
Story first published: Tuesday, June 23, 2020, 10:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X