For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేరుకే పెద్ద దేశాలు... చేసేవి మాత్రం ఇలాంటి పనులు

|

అభివృద్ధిలో దూసుకుపోయిన దేశాలు కొన్ని.. అభివృద్ధి చెందుతూ అనేక దేశాలకు ఆదర్శంగా ఉన్న దేశాలు మరికొన్ని. టెక్నాలజీ పరంగా దేశాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఆకాశానికి నిచ్చెన వేస్తున్నాయి. కానీ తమ రక్షణాత్మక ధోరణిని మాత్రం వీడటం లేదు. ఇప్పటి వాటి వల్ల తమ దేశ ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటున్నాయి తప్ప మరిన్ని దేశాలు ఇదే రకంగా ప్రవర్తిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయన్న దాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఇందుకు నిదర్శనమే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వెల్లడించిన తాజా వివరాలు.

28 కొత్త వాణిజ్య నిరోధక చర్యలు

28 కొత్త వాణిజ్య నిరోధక చర్యలు

* జీ20 దేశాలు అంటే మనకు తెలిసిందే. వీటిలో అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఉన్నాయి. వీటిలో భారత్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, యుకె, యుఎస్ వంటి దేశాలున్నాయి.

* ఈ దేశాలు ఈ మధ్య కాలంలో వాణిజ్య పరంగా కొన్ని ప్రకటనలు చేశాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో వస్తువుల ఎగుమతులు, దిగుమతులు చాలా సహజంగా మారి పోయాయి. అయితే ఈ మధ్య కాలంలో చాలా దేశాలు తమ దేశానికి వచ్చే ఉత్పత్తులపై కొన్ని ఆంక్షలు విధిస్తున్నాయి.

* డబ్ల్యూటీఓ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది మే మధ్య కాలం నుంచి అక్టోబర్ మధ్య కాలం (6 నెలలు) వరకు 20 దేశాలు 28 రకాల వాణిజ్య నిరోధక చర్యలు తీసుకున్నాయి.

* అవి.. దిగుమతి అయ్యే ఉత్పత్తులపై పన్నులు పెంచడం, దిగుమతులను నిషేధించడం, దిగుమతులకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయడం వంటివి.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా...

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా...

* దేశాల మధ్య వాణిజ్య పరమైన నియంత్రణ చర్యలు క్రమంగా పెరుగుతున్నాయి. చరిత్ర లో ఎన్నడూ లేని స్థాయికి ఈ చర్యలు చేరుకున్నాయని డబ్ల్యూటీఓ చెబుతోంది.

* నియంత్రణ చర్యలు 46,040 కోట్ల డాలర్ల విలువైన వాణిజ్యాన్ని కవర్ చేశాయి. గత ఏడాదితో పోల్చితే ఈ విలువ 37 శాతం పెరిగింది.

ట్రంప్ పుణ్యమే!

ట్రంప్ పుణ్యమే!

* తమ దేశ ప్రయోజనాల కోసం రక్షణాత్మక ధోరణిని అనుసరించడం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదలు పెట్టాడు. తమ దేశంలో ఉన్న వారికి ఉపాధి అవకాశాలను పెంచేందుకు చర్యలు మొదలు పెట్టాడు. దీనివల్ల అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు తప్పని సరిగా అమెరికన్లనే నియమించుకోవాల్సి వస్తోంది. విదేశీయులకు ఇచ్చే హెచ్ 1 బీ వీసా వంటి వాటిపై ఆంక్షలు విధించాడు. చైనాకు చెక్ పెట్టేందుకు ఆ దేశం నుంచి అమెరికా వస్తున్న ఉత్పత్తులపై సుంకాలు పెంచాడు. దీనికి ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై చైనా సుంకాలు పెంచింది. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. చైనా ఉత్పత్తుల వల్ల తమ దేశంలో ఉపాధి అవకాశాలు దెబ్బ తింటున్నాయంటూ ట్రంప్ చర్యలు మొదలెట్టారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాలు కూడా తమ దేశ ప్రయోజనాల కోసం వాణిజ్యపరమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. దీనివల్ల వివిద దేశాల మధ్య వాణిజ్య సంభందాలు దెబ్బతినడమే కాకుండా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ వృద్ధి పైనా ప్రభావం పడే పరిస్థితులు మొదలయ్యాయి.

English summary

G20 countries imposed 28 new trade restrictions in past 6 months.

Trade restrictive measures increasing..G20 countries imposed 28 new trade restrictions in past 6 months.The G20 countries have imposed as many as 28 new trade-restrictive measures in just 6 months. tariff increases, import bans and stricter customs procedures for imports were imposed between mid-May and mid-October 2019, according to a WTO report. G20 members include India, Argentina, Australia, Brazil, Canada, China, France, Germany, Japan, Russia, the UK, and the US, among others.
Story first published: Friday, November 22, 2019, 14:04 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more