For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలెగ్జాండర్ దండయాత్ర వంటిది: అమెజాన్‌పై కిషోర్ బియానీ షాకింగ్ కామెంట్స్

|

ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య జరిగిన డీల్‌కు అమెజాన్ చిక్కులు తెచ్చిన విషయం తెలిసిందే. అమెజాన్-ఫ్యూచర్ రిటైల్ మధ్య జరిగిన షేర్ల విక్రయ ఒప్పందంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) ఇటీవలే రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిషోర్ బియానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తన ఉద్యోగులకు లేఖ రాశారు.

PNB కస్టమర్లకు అలర్ట్: ఫిబ్రవరి 1 నుండి ఈ ATM నుండి డబ్బు తీసుకోలేరుPNB కస్టమర్లకు అలర్ట్: ఫిబ్రవరి 1 నుండి ఈ ATM నుండి డబ్బు తీసుకోలేరు

అలెగ్జాండర్ తోక ముడిచాడు

అలెగ్జాండర్ తోక ముడిచాడు

కిషోర్ బియానీ నేతృత‍్వంలోని ఫ్యూచర్ గ్రూప్ 3.4 బిలియన్ డాలర్ల రిలయన్స్ రీటైల్ డీల్ ఒప్పందానికి వ్యతిరేకంగా అమెజాన్ పోరాటం చేస్తోంది. ఈ ఒప్పందం అమలును అడ్డుకునేందుకు అమెజాన్ చేసే ప్రయత్నాలపై కిషోర్ బియానీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ భూమిని ఆక్రమించాలన్న అలెగ్జాండర్ ది గ్రేట్ క్రూరమైన కోరిక వంటిదే అమెజాన్ ప్రయాస కూడా అన్నారు. ప్రపంచంలో చాలా భాగాన్ని జయించిన గ్రీకువీరుడు అలెగ్జాండర్ భారత్‌లో తోక ముడిచాడని, ఈ విషయాన్ని చరిత్ర చెబుతోందన్నారు.

కిషోర్ బియానీ షాకింగ్ కామెంట్స్

కిషోర్ బియానీ షాకింగ్ కామెంట్స్

తద్వారా బియానీ.. అమెజాన్‌ను అలెగ్జాండర్‌తో పోల్చారు. అమెజాన్ పదేపదే ఫ్యూచర్ రిటైల్ పైన, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పైన, ప్రమోటర్ల పైన దాడి చేస్తోందన్నారు. అమెజాన్ చివరకు తన బంధువులను కూడా వదలడం లేదన్నారు. అలెగ్జాండర్ ఆక్రమణ దురుద్దేశ్యంతో వచ్చాడని, అమెజాన్ కూడా తన ఉత్పత్తికి అలెక్సా అని పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.

ఏం జరిగిందంటే

ఏం జరిగిందంటే

కాగా, రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందానికి అమెజాన్ చెక్ చెప్పాలని ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, కేంద్రం అనుమతి లేకుండానే ఫ్యూచర్ రిటైల్‌లో అమెజాన్ పెట్టుబడులు పెట్టి పరోక్ష నియంత్రణకు ప్రయత్నించిందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. దేశీయ ఈ-కామర్స్ సంస్థల్లో FDI ద్వారా 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి కేంద్రం అనుమతులు తప్పనిసరి.

అయితే అప్పుల ఊబిలో ఉన్న ఫ్యూచర్ రిటైల్.. రిలయన్స్‌లో విలీనం కోసం రూ.24,713 కోట్లతో డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్ అమెజాన్‌కు రుచించడం లేదు. ఫ్యూచర్-అమెజాన్ మధ్య డీల్‌కు ఇది విరుద్ధమని అమెజాన్ వాదిస్తోంది. అందుకే కిషోర్ బియానీ సహా పలువురిని అరెస్టు చేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది అమెజాన్.

English summary

అలెగ్జాండర్ దండయాత్ర వంటిది: అమెజాన్‌పై కిషోర్ బియానీ షాకింగ్ కామెంట్స్ | Future Group's Kishore Biyani writes to employees, says Amazon creating ruckus

As the legal battle between Future Retail and Amazon continues to drag out, Future Group chairman Kishore Biyani wrote to employees of the company in a bid to allay fears.
Story first published: Sunday, January 31, 2021, 13:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X