For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Budget 2022: నిర్మలమ్మ బడ్జెట్‌తో ఎవరిపై ఎంత ప్రభావం?

|

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిన్న(ఫిబ్రవరి 1, మంగళవారం) బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తాజా బడ్జెట్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కాబట్టి ఇది ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రారంభం అవుతుంది. కరోనా కారణంగా చిన్నవ్యాపారాలు చిన్నభిన్నమయ్యాయి. సామాన్యుల నుండి ఉద్యోగుల వరకు ఇబ్బందులు పడుతున్నారు.

కరోనాతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తాజా బడ్జెట్ పైన ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ, రైతులకు-వ్యవసాయానికి, టెక్నాలజీకి, రక్షణ రంగానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. నిర్మలా సీతారామన్ రూ.39.5 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో తాజా నిర్మలమ్మ బడ్జెట్ వల్ల ఏ రంగాలపై ఎలా ప్రభావం చూపుతుందో చూద్దాం.

ఈవీ బ్యాటరీ మేకర్స్

ఈవీ బ్యాటరీ మేకర్స్

క్లీన్ ట్రాన్సుపోర్ట్ టెక్నాలజీని ప్రోత్సహించే దిశగా బడ్జెట్‌లో అడుగు వేశారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త స్వాపింగ్ విధానం నుండి బ్యాటరీ తయారీదారులు ప్రయోజనం పొందుతారు. లబ్దిదారుల్లో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ ఉన్నాయి.

ట్రాన్సుపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్

ట్రాన్సుపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్

మూడేళ్లలో రిమోడ్ రోడ్లు, నగరాల్లో మాస్ రవాణా, 400 కొత్త కొత్త వందే భారత్ రైళ్లలో పెట్టుబడుల కోసం ప్రణాళికలు లార్సన్ అండ్ టుబ్రో లిమిటెడ్, జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్, ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్, కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అల్‌కార్గో లాజిస్టిక్స్ లిమిటెడ్, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ ప్రయోజనం పొందుతాయి.

మెటల్స్

మెటల్స్

కేంద్ర ప్రభుత్వం పైప్డ్ వాటర్ కోసం 600 బిలియన్ల రూపాయలను కేటాయించింది. వీటి ద్వారా 338 మిలియన్ల ఇళ్లకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కేటాయింపుల ద్వారా వేదాంత లిమిటెడ్, టాటా స్టీల్ లిమిటెడ్, జేఎస్‌డబ్ల్యు స్టీల్ లిమిటెడ్, జిందాల్ స్టీల్ స్టెయిన్ లెస్ స్టీల్ లిమిటెడ్, పైప్ మార్కెట్ జైన్ ఇర్రిగేషన్ సిస్టమ్ లిమిటెడ్, కేఎస్‌బీ లిమిటెడ్, కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ లాభపడతాయి.

సోలార్

సోలార్

స్థానిక ఉత్పత్తిని పెంచేందుకు సోలార్ మాడ్యూల్స్ ప్రోత్సాహానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కింద 195 బిలియన్ రూపాయలు కేటాయించారు. వీటి ద్వారా టాటా పవర్ లిమిటెడ్, సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లాభపడతాయి.

సిమెంట్, కన్స్ట్రక్షన్

సిమెంట్, కన్స్ట్రక్షన్

తక్కువ ఆదాయం పొందేవారికి ప్రభుత్వం ఇళ్లు నిర్మించే ప్రణాళికను చేపట్టింది. దీని ద్వారా అల్ట్రా టెక్ సిమెంట్, అంబుజా సిమెంట్, బిర్లా సిమెంట్, ఏసీసీ సిమెంట్ వంటి కంపెనీలు ప్రయోజనం పొందుతాయి.

టెల్కోస్, డేటా సెంటర్స్

టెల్కోస్, డేటా సెంటర్స్

2022లో 5జీ యాక్షన్ టెలికం రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్‌లో భాగంగా డేటా స్టోరేజ్ వంటి వాటి వల్ల భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, HDFCL లిమిటెడ్, తేజాస్ నెట్ వర్క్స్ లిమిటెడ్, స్టెరిలైట్ టెక్నాలజీ లాభపడుతాయి.

డిజిటల్ ఫైనాన్స్

డిజిటల్ ఫైనాన్స్

కేంద్ర ప్రభుత్వం డిజిటల్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో పాలసీ బజార్ మాతృసంస్థ పీబీ ఫిన్ టెక్ లిమిటెడ్, న్యూలీ లిస్టెడ్ పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్, ఈ-క్లర్క్ సర్వీసెస్ లిమిటెడ్, పైసాలో డిజిటల్ లిమిటెడ్ ప్రయోజనం పొందుతాయి.

డిఫెన్స్ ఉత్పత్తులు

డిఫెన్స్ ఉత్పత్తులు

బడ్జెట్‌లో డిఫెన్స్ రంగానికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. అంతేకాదు, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన దృష్టి సారించింది. వీటి ద్వారా లార్సన్ అంట్ టుబ్రో లిమిటెడ్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, పరాస్ డిఫెన్స్, స్పెస్ టెక్నాలజీ లిమిటెడ్ ప్రయోజనం పొందవచ్చు. డ్రోన్ స్టార్టప్స్ వల్ల జ్యూస్ న్యూమెరిక్స్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, బోట్‌ల్యాబ్ డైనమిక్స్ ప్రయోజనం పొందుతాయి.

లూజర్స్ ఇవేనా?

లూజర్స్ ఇవేనా?

- డిజిటల్ కరెన్సీని ప్రారంభిస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. ఇది దేశంలో సంప్రదాయ బ్యాంకింగ్ నియమాలను మారుస్తుంది. ఇది ప్రభుత్వరంగ ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకులను ప్రభావితం చేస్తుంది.

- డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పైన 30 శాతం పన్ను విధించాలని నిర్ణయించారు. ఇది క్రిప్టో ఏజెన్సీలు వాజిర్ఎక్స్, జెబ్‌పే, కాయిన్ డీసీఎక్స్, కాయిన్ స్విచ్ కుబేర్ పైన ప్రభావం చూపుతాయి.

- సోలార్ పవర్, ప్లాన్స్ నేపథ్యంలో కోల్, థర్మల్ పవర్ రంగంలో ఉన్న కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ, అదానీ ఎంటర్‌ప్రాజెస్ పైన ప్రభావం ఉంటుంది.

- సెమీ కండక్టర్స్ కొరత కారణంగా ఇప్పటికే ఆటో పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎస్ అండ్ పీ బీఎస్ఈ ఆటో ఇండెక్స్‌లో దారుణంగా దెబ్బతిన్నది ఆటో. బడ్జెట్‌లో ఆటో పరిశ్రమపై పెద్దగా దృష్టి సారించలేదు ఆర్థికమంత్రి. ఇప్పటికే చిప్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో పరిశ్రమకు ఇది మరో షాక్. దీంతో ఈ రంగంలోని సంస్థలపై ప్రభావం ఉంటుంది.

English summary

Budget 2022: నిర్మలమ్మ బడ్జెట్‌తో ఎవరిపై ఎంత ప్రభావం? | Full list of winners and losers from Nirmala Sitharaman's Budget 2022

Prime Minister Narendra Modi’s government laid out India’s budget for the financial year starting April 1, months after a devastating second Covid-19 wave that crippled small businesses and deepened the country’s already vast inequalities.
Story first published: Wednesday, February 2, 2022, 12:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X