For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.5 కోట్ల నుండి రూ.38 లక్షల కోట్లకు: 65 ఏళ్లలో ఇప్పటికీ నెంబర్ వన్

|

ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) 66వ వసంతంలోకి అడుగు పెట్టింది. 1956లో ప్రారంభమైన ఎల్ఐసీ ఆగస్ట్ 31, 2021 66వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఆరున్నర దశాబ్దాల క్రితం(1956లో) ఎల్ఐసీ రూ.5 కోట్లతో ప్రారంభమైంది. ఇప్పుడు అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ ఇన్సురెన్స్ కంపెనీగా నిలిచింది. నాడు రూ.5 కోట్లతో ప్రారంభమైన ఈ కంపెనీ ఇప్పుడు రూ.38,04,610 కోట్లకు చేరుకుది. ఇందులో లైఫ్ ఫండ్ రూ.34,36,686 కోట్లుగా ఉంది. సర్వే నివేదిక ప్రకారం ప్రపంచంలోనే బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సురెన్స్-100లో ఈ ఆరున్నర దశాబ్దాల కంపెనీ మూడో స్థానంలో ఉంది. ఇది ప్రపంచంలో మూడో స్ట్రాంగెస్ట్, 10వ మోస్ట్ వ్యాల్యుబుల్ బ్రాండ్‌గా ఉంది. ఇక దేశంలో ప్రయివేటు రంగం ఇన్సురెన్స్ రంగంలోకి అడుగు పెట్టి 20 ఏళ్లు దాటినప్పటికీ ఇప్పటికీ ఎల్ఐసీ టాప్ వన్‌గా నిలవడం, అంతేకాకుండా ఇప్పటికీ మార్కెట్ వాటాలో ఎల్ఐసీదే పైచేయిగా ఉండటం గమనార్హం.

ఇప్పటికీ ఇన్సురెన్స్ రంగం ఫస్ట్ ప్రీమియం ఆదాయంలో ఎల్ఐసీ వాటా 66.18 శాతం, పాలసీ సంఖ్యలో 74.58 శాతం వాటాను కలిగి ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మార్చి 31, 2021 ముగిసే సమయానికి 2.10 కోట్ల కొత్త పాలసీలు నమోదయ్యాయి. కొత్త బిజినెస్ 3.48 శాతం వృద్ధి నమోదు చేసింది. ఫస్ట్ ఇయర్ ప్రీమియం రూ.1.84 లక్షల కోట్లుగా నమోదయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ ఇన్సురెన్స్ కేటగిరీలో 19 అవార్డులు దక్కించుకుంది.

From Rs 5 crore to Rs 38 lakh crore: LICs 66 years journey

ఈ ప్రభుత్వం బీమా సంస్థ దేశ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో దూసుకు పోతోంది. జాతీయ ప్రాధాన్యతలు, పాలసీదారులకు మంచి రాబడులు కంపెనీ పెట్టుబడికి ప్రధాన పారామితులు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 229.15 లక్షల క్లెయిమ్స్‌ను పరిష్కరించింది. వీటి వ్యాల్యూ రూ.1,47,754 లక్షల కోట్లు.

English summary

రూ.5 కోట్ల నుండి రూ.38 లక్షల కోట్లకు: 65 ఏళ్లలో ఇప్పటికీ నెంబర్ వన్ | From Rs 5 crore to Rs 38 lakh crore: LIC's 66 years journey

According to the survey report of Brand Finance Insurance 100, in 65 years, LIC has established itself as the 3rd strongest and 10th most valuable brand in the world.
Story first published: Friday, September 3, 2021, 19:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X