For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళలకు 3 నెలలు ఉచిత గ్యాస్ సిలిండర్, జన్ ధన్ అకౌంట్లో డబ్బులు

|

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఇండియా లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక ప్యాకేజీని గురువారం ప్రకటించారు. రూ.1 లక్షా 70వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించడంతో పాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్ యోజన కింద 80 కోట్ల మంది ప్రజలకు నెలకు 5 కిలోల బియ్యం లేదా గోదుమలు ఇస్తుంది. మూడు నెలల పాటు ఉచితంగా ఇస్తారు. అలాగే కిలో పప్పు దినుసులు ఇస్తుంది.

రూ.1లక్షా 70 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ, రూ.50 లక్షల ఇన్సురెన్స్, 80 కోట్ల మందికి ఉచిత బియ్యంరూ.1లక్షా 70 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ, రూ.50 లక్షల ఇన్సురెన్స్, 80 కోట్ల మందికి ఉచిత బియ్యం

ప్రత్యక్ష ప్రయోజన బదలీ.. రైతులకు

ప్రత్యక్ష ప్రయోజన బదలీ.. రైతులకు

నిర్మలా సీతారామన్ ప్రత్యక్ష బదలీ ప్రయోజనం కింది చర్యలను ప్రకటించారు. రైతులు, MNREGA వర్కర్స్, పేద వితంతులు, పెన్షనర్లు, వికలాంగులు, ఉజ్వల పథకం కింది మహిళలకు, స్వయం ఉపాధి మహిళలు, నిర్మాణ రంగ కార్మికులకు ఈ ప్రయోజనం ఉంటుంది.

- రైతులకు కిసాన్ బీమా యోజన కింద ఇచ్చే రూ.6,000 నగదులో మొదటి విడదను వెంటనే అకౌంట్లో వేస్తాం. దీని ద్వారా 8.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం దక్కుతుంది. రైతుల అకౌంట్లలో నేరుగా జమ చేస్తాం.

మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్

మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్

- MGNREGA కింద వేతన రేటును పెంచడం ద్వారా ఒక్కో కార్మికుడికి అదనంగా రూ.2000 ఇస్తారు.

- ఉజ్వల కింద ఉన్న మహిళలకు వచ్చే మూడు నెలల పాటు ఉచిత గ్యాస్ సిలిండర్లు.

- కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారికి ఆర్థిక సాయం.

- సీనియర్ సిటిజన్లు, వితంతువులు, వికలాంగులకు రూ.1000 చొప్పున మూడు నెలలు అందుతుంది. ఇది రెండు ఇన్‌స్టాల్‌మెంట్లలో వస్తుంది. దీనివల్ల 3 కోట్ల మందికి ప్రయోజనం.

జన్ ధన్ అకౌంట్లో రూ.500

జన్ ధన్ అకౌంట్లో రూ.500

- మూడు నెలల పాటు జన్ ధన్ యోజన అకౌంట్ ఉన్న మహిళల అకౌంట్లలో నెలకు రూ.500 చొప్పున ప్రభుత్వం వేస్తుంది.

- 7 లక్షల స్వయం సహాయక బృందాలకు 20 లక్షల సాయం. డ్వాక్రా మహిళలకు సాయం రూ.10 లక్షల నుండి రూ.20 లక్షలకు పెంపు.

- ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో రేషన్‌తో పాటు కిలో కందిపప్పు ఉచితం.

English summary

మహిళలకు 3 నెలలు ఉచిత గ్యాస్ సిలిండర్, జన్ ధన్ అకౌంట్లో డబ్బులు | Free gas cylinders for 3 months under ujwala scheme for 8 cr people

Cash transfer to cover farmers, MNREGA workers, poor widows and pensioners and divyang. Women under DBT and those under Ujjwala, self help group women, construction workers.
Story first published: Thursday, March 26, 2020, 14:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X