For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PNBని ముంచుతున్న కార్పొరేట్ ఫ్రాడ్స్: రెండేళ్లలో 2 బిలియన్ డాలర్ల లాస్!

|

పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీ ఎన్ బీ )... దేశంలో రెండో అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు. 1894 లో ఏర్పాటైన ఈ బ్యాంకు న్యూ ఢిల్లీ కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ బ్యాంకునకు 7,000 పైగా బ్రాంచీలు, సుమారు 9,000 ఎటిఎం లు ఉన్నాయి. దాదాపు 11.5 కోట్ల మంది వినియోగదారులకు రోజు తన సేవలు అందిస్తుంది. లక్షల్లో ఉద్యోగులున్నారు. సుమారు 7 లక్షల కోట్ల టర్నోవర్ కలిగి ఉన్న ఈ బ్యాంకు ఇటీవల దేశవ్యాప్తంగా కార్పొరేట్ ఫ్రాడ్స్ కు కేంద్రంగా నిలిచింది.

వజ్రాల వ్యాపారి నిరవ్ మోడీ ఫ్రాడ్ దేశాన్నే కాకుండా ప్రపంచాన్నే నివ్వెరపరిచేలా చేసింది. ఒక బ్యాంకును అంత సులభంగా ఒక కంపెనీ ఎలా మోసగించగలిగిందా అని ఆశ్చర్యపోయారు. నిరవ్ మోడీ రూపం భారీ ఎదురుదెబ్బ తిన్న పంజాబ్ నేషనల్ బ్యాంకును ఇంకా మోడీ బకాయిలు వదలటం లేదు. తాజాగా మరో కార్పొరేట్ ఫ్రాడ్ కదిలించింది. ప్రముఖ వ్యాపారి, మారుతి సుజుకి మాజీ ఎండీ జగదీష్ ఖట్టర్ కూడా బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టటంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు మరోసారి వార్తల్లో నిలిచింది.

5 ఏళ్ల క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు రూ.18 లక్షలు5 ఏళ్ల క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు రూ.18 లక్షలు

2 బిలియన్ డాలర్ల నష్టం...

2 బిలియన్ డాలర్ల నష్టం...

పంజాబ్ నేషనల్ బ్యాంకు ను వజ్రాల వ్యాపారి నిరవ్ మోడీ ఒక్కరే సుమారు రూ 11,000 కోట్ల మేరకు ముంచేశారు. మేహూల్ చోక్సి తో కలిపి మొత్తంగా రూ 12,700 కోట్ల కు కుచ్చు టోపీ పెట్టారు. తాజాగా జగదీష్ ఖట్టర్ రూ 110 కోట్ల మేరకు బ్యాంకు నకు బకాయిలు చెల్లించలేదు. ఇవి కాకుండా గత రెండేళ్లలో పంజాబ్ నేషనల్ బ్యాంకు అనేక డిఫాల్ట్ లను కూడా ఎదుర్కొంది. వీటన్ని విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు ఉంటుందని ప్రముఖ వార్త ఏజెన్సీ బ్లూమ్బెర్గ్ ఒక కథనంలో వెల్లడించింది. అటు నివావ్ మోడీ, మేహూల్ చోక్సి లపై సిబిఐ కేసు నమోదు చేయగా... ఇటు జగదీష్ ఖట్టర్ పైన కూడా పీ ఎన్ బీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.

వ్యాపార వైఫల్యమే...

వ్యాపార వైఫల్యమే...

జగదీష్ ఖట్టర్ పేరు అప్పట్లో కార్పొరేట్ రంగంలో మారుమోగిపోయేది. దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి కి అయన మాజీ ఎండీ. కొంతకాలం తర్వాత అయన సొంతంగా స్టార్టుప్ కంపెనీ స్థాపించారు. కార్నేషన్ అనే బ్రాండ్ పేరుతొ దేశవ్యాప్తంగా కార్ల విడి భాగాలు విక్రయించటం, కార్ల సర్వీసింగ్, రిపేర్ సేవలు అందించటం ఈ కంపెనీ ముఖ్య వ్యాపకం. కార్నేషన్ బ్రాండ్ తో దేశంలో అనేక ఫ్రాంచైజ్ దుకాణాలు తెరిచారు. మొదట్లో బాగానే రాను రాను బ్రాండ్ ప్రెజన్స్ తగ్గిపోయింది. ఇందుకు అనేక కారణాలు ఉండొచ్చు. కానీ జగదీష్ ఖట్టర్ మాత్రం ఇది ఒక వాస్తవిక వ్యాపార వైఫల్యం మాత్రమేనని బ్లూమ్బెర్గ్ వార్త సంస్థకు తెలియజేశారు. ఇందులో తప్పేమి జరగలేదని, ఫోరెన్సిక్ రిపోర్ట్ లో కూడా తప్పు జరిగినట్లు తేలలేదని స్పష్టం చేసారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే... 2012 లోనే కార్నేషన్ అకౌంట్ ను బాడ్ లోన్ కింద నమోదు చేసిన బ్యాంకు... ఇప్పటివరకు చర్యలు తీసుకోలేకపోయింది. కంపెనీ లోన్ కు సెక్యూరిటీగా పెట్టిన ఆస్తులను జగదీష్ ఖట్టర్ బ్యాంకు కు తెలియకుండా విక్రయించి మోసం చేసారని పీ ఎన్ బీ ఆరోపించింది.

అసలు సంగతి వేరే...

అసలు సంగతి వేరే...

తన పేరునే బ్రాండ్ గా కోట్ల లో వ్యాపారం చేసే నిరవ్ మోడీ... వజ్రాల నగలకు పెట్టింది పేరు. ఏంటో మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సెలెబ్రిటీలు అయన డిజైన్లకు ఫిదా అయిపోయేవారు. విదేశాల్లో ని మహా నగరాల్లో షాపులు తెరిచి నిరవ్ మోడీ అనే బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేసారు. ఆయా వ్యాపారాలకు లైన్ ఆఫ్ క్రెడిట్ రూపం లో రూ వేళ కోట్ల రుణాలు తీసుకున్నారు. అయితే, బ్యాంకు కు ఏమి తెలియకుండానే ఏళ్ల కేల్లు రూ వేళ కోట్లు మాయం అవుతుంటే ఎవరూ పట్టించు కోలేదు. ఒక చిన్న వినియోగదారునికి రూ 1 అప్పు ఇస్తే వాడి ముక్కు పిండి మరీ వసూలు చేసే బ్యాంకులు ఎందుకిలా వేళా కోట్ల వ్యవహారంలో నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తాయో తెలియంది. ఆడిటింగ్ చేసే సంస్థలు కూడా ఏ లెక్కలు చూసి వాటిని ఆమోదిస్తాయో అంతకంటే కూడా తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం. అది నిరవ్ మోడీ అయినా.. జగదీష్ ఖట్టర్ అయినా బ్యాంకు లో ఇంటి దొంగల ప్రమేయం లేకుండా దానిని బురిడీ కొట్టించటం సాధ్యం కాదు. అంత డిజిటల్ మాయం అవుతున్న రోజుల్లో కూడా పేపర్ యుగం లో కంటే దారుణంగా ఫ్రాడ్స్ జరుగుతుంటే... టెక్నాలజీ ఉపయోగం ఏమిటా అన్న అనుమానాలు కలగకుండా ఉండవు.

బ్యాంకులు మారాలి...

బ్యాంకులు మారాలి...

రాజకీయ నాయకుల ఒత్తిడి కి లొంగి పోయి, లేదా లంచాలకు ఆశపడి అర్హత లేకున్నా రూ వందలు, రూ వేళా కోట్లు రుణాలు మంజూరు చేయటం ఇప్పటికైనా బ్యాంకులు నిలిపివేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో అర్హత ఉన్న చిన్న వర్తకులు, ఇండివిడ్యుల్స్ , స్వయం ఉపాధి పొందే వారికీ చిన్న మొత్తాల్లో రుణాలు మంజూరు చేసి దేశ అభివృద్ధి భాగస్వామ్యులు కావాలని పిలుపునిస్తున్నారు. పెద్ద మొత్తం లో రుణాలు తీసుకొన్న ఒకడు మునిగితే దాని ప్రభావం అటు బ్యాంకు మనుగడపై, ఇటు ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. అందుకే బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు కోరుతున్నారు.

English summary

PNBని ముంచుతున్న కార్పొరేట్ ఫ్రాడ్స్: రెండేళ్లలో 2 బిలియన్ డాలర్ల లాస్! | Fraud hit Punjab National Bank alleges it has been cheated again

Scandal-hit Indian lender Punjab National Bank alleged it has been cheated -- its third complaint since 2018 when it suffered through a $2 billion blow.
Story first published: Thursday, December 26, 2019, 19:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X