For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Demonetisation: రూ.2,000 నోట్లను వెంటనే రద్దు చేయాలి, రూ.10,000 దాటితే ట్యాక్స్!!

|

ప్రధాని నరేంద్ర మోడీ నాలుగేళ్ల క్రితం నవంబర్ 8వ తేదీన రాత్రి ఎనిమిది గంటలకు పెద్ద నోట్ల(అప్పటి రూ.500, రూ.1000)ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని ఒక్క ప్రకటనతో నాడు ఎనభై ఆరు శాతంగా ఉన్న కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల వద్ద వరుస కట్టారు. రూ.500, రూ.1000 నోట్లను మార్చుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత క్రమంగా రూ.500, రూ.2000 నోట్లను తీసుకు వచ్చింది. రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నప్పటికీ వీటి ముద్రణ తగ్గిపోయింది.

Gas Refill: ఈ నెంబర్‌తో... వాట్సాప్ ద్వారా గ్యాస్ బుక్ చేయండి!Gas Refill: ఈ నెంబర్‌తో... వాట్సాప్ ద్వారా గ్యాస్ బుక్ చేయండి!

నోట్ల రద్దు తర్వాత దెబ్బమీద దెబ్బ

నోట్ల రద్దు తర్వాత దెబ్బమీద దెబ్బ

నోట్ల రద్దు భావి భారతానికి ఎంతో ప్రయోజనకరంగా ఉండటంతో పాటు డిజిటలైజేషన్‌కు ఎంతగానే దోహదపడుతుందని ఆర్థికవేత్తల అభిప్రాయం. అయితే అనూహ్యంగా ఈ నిర్ణయం నేపథ్యంలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగిత రేటు నాటికి నాలుగేళ్ల గరిష్టానికి చేరుకుంది. 2017-18లో 45 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. నోట్ల రద్దు వల్ల నాడు ఉద్యోగాలపై, ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడిందని పలు సర్వేలు వెల్లడించాయి. అయితే నోట్ల రద్దు నుండి కోలుకుంటున్న సమయంలో గత ఏడాది మందగమనం, ఇప్పుడు కరోనా దెబ్బమీద దెబ్బ కొట్టింది.

డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగినా.. బ్లాక్ మనీకి అడ్డు

డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగినా.. బ్లాక్ మనీకి అడ్డు

నోట్ల రద్దు ప్రకటించిన నాలుగేళ్ల తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్ భారీగానే పెరిగాయి. కానీ ఊహించినంత మాత్రం పెరగలేదని చెబుతున్నారు. ఇప్పటికే నిత్యావసరాలు, కిరాణా సామాగ్రి కొనుగోలుకు చాలా వరకు డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే పౌరులు, ప్రభుత్వ అధికారులు, వారి కుటుంబాల ఆస్తులను తప్పనిసరిగా బహిర్గతం చేయడం, ఆస్తులతో ఆధార్ లింకింగ్ వంటి అంశాలు నల్లధనాన్ని తగ్గించేందుకు దోహదపడ్డాయి.

డబ్బు వినియోగం ఉంది..

డబ్బు వినియోగం ఉంది..

ఇటీవల విడుదలైన ఓ సర్వే ప్రకారం గత 12 నెలల కాలంలో 34 శాతం మంది తమ నెలవారీ నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం నేరుగా డబ్బును చెల్లించారు. 31 శాతం మంది తమ ఉద్యోగుల వేతనాలను, క్యాష్, పెయిడ్ బిల్స్ రూపంలో ఇచ్చారు. సివిక్ కోఆపరేషన్ అనే సోషల్ నెట్ వర్కింగ్ సైట్ 15000 మందిని సర్వే చేసింది. నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్రం తీసుకున్న నోట్ల రద్దును సమర్థిస్తూనే, ప్రస్తుతం ఉన్న రూ.2000 నోట్లను కూడా రద్దు చేయాలని చాలామంది అభిప్రాయపడ్డారు.

వెంటనే రూ.2000 నోట్లను రద్దు చేయాలి.. ట్యాక్స్ వేయాలి

వెంటనే రూ.2000 నోట్లను రద్దు చేయాలి.. ట్యాక్స్ వేయాలి

నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని చాలామంది ఈ సర్వేలో తెలిపారు. ప్రజల ఆస్తులను మొత్తం ఆధార్ వంటి వాటికి లింక్ చేయాలని 23 శాతం మంది, అందరు మంత్రులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, తమ ఆస్తులను ప్రకటించాలని 38 శాతం మంది చెప్పారు. ఇప్పటికిప్పుడూ రూ.2000 నోట్లను రద్దు చేయాలని 10 శాతం మంది చెప్పారు. రూ.10,000కు పైగా చేసే ప్రతి ట్రాన్సాక్షన్ పైన ప్రభుత్వం వెంటనే 2 శాతం ట్యాక్స్ విధించాలని 7 శాతం మంది సూచించారు.

English summary

Demonetisation: రూ.2,000 నోట్లను వెంటనే రద్దు చేయాలి, రూ.10,000 దాటితే ట్యాక్స్!! | Four years after demonetisation, cash still rules in day to day transactions

Four years after demonetisation, cash transaction continues to be used in buying essentials/groceries and paying domestic staff but most citizens feel mandatory disclosure of assets of public officials and their families and linking Aadhaar to property ownership for all will lead to major reduction in black money.
Story first published: Sunday, November 8, 2020, 14:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X