For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారానికి నాలుగు రోజులే ఆఫీసులు.. అక్కడ ట్రైల్ విజయవంతం.. OK చెప్పిన కంపెనీలు..

|

Four Days Work: వారంలో రెండు రోజులు సెలవు ఇవ్వటానికే చాలా కంపెనీలు ముక్కుతాయి మూలుగుతాయి. ఇండియాలో అయితే అసలు వారాంతపు సెలవు కూడా లేకుండా పనిచేయించుకుందామా అన్నట్లు చాలా కంపెనీలు ఆలోచిస్తుంటాయి. ఇలాంటి సందర్భంలో అసలు వారానికి నాలుగు రోజులు మాత్రమే ఆఫీసులు అనే వార్త వినటానికి ఎంత బాగుందో కధ..

ట్రైల్ సక్సెస్..

ట్రైల్ సక్సెస్..

వారానికి నాలుగు రోజులు మాత్రమే ఆఫీసులు అనే కాన్సెప్ట్ ముందుగా యూకేలో ట్రైల్ నిర్వహించారు. అయితే ఇది మంచి ఆదరణను పొందటంతో పాటు అక్కడి చాలా కంపెనీలు సైతం ఇందుకు అంగీకారం తెలిపాయి. డజన్ల మంది బ్రిటన్ వ్యాపార యజమానులు సైతం ట్రైల్ తర్వాత దీనినే కొనసాగించాలని భావిస్తున్నట్లు సమారం. దీనివల్ల ఉద్యోగులకు వ్యక్తిగత జీవితంతో పాటు పని ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలు కలుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మంచిగా ఉంటుందని వారు అంటున్నారు.

యూకేలో ఇలా చేశారు..

యూకేలో ఇలా చేశారు..

బ్రిటన్‌లోని 61 కంపెనీల ఉద్యోగులు జూన్-డిసెంబర్ 2022 మధ్య కాలంలో వారంలో నాలుగు రోజుల పాటు సగటున 34 గంటలు పనిచేశారు. పనివేళలను కుదించినప్పటికీ వారు పాత జీతాన్నే ఎలాంటి తగ్గింపులూ లేకుండా పొందుతున్నారు. వీటిలో 56 కంపెనీలు అంటే 92 శాతం మంది యజమానులు దీనిని ఇలాగే కొనసాగించాలని అంటున్నారు. దీంతో యూకేలో ఈ కొత్త పని గంటల విధానం చాలా పాపులారిటీని సంపాదించిందని చెప్పుకోవచ్చు.

పరిశోధన ప్రకారం..

పరిశోధన ప్రకారం..

వారానికి నాలుగు రోజులు పనివిధానంపై యూకేలో నిర్వహించింది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రైల్ అని బ్రిటన్ కు చెందిన అటానమీ అనే పరిశోధనా సంస్థ వెల్లడించింది. ప్రతిభ కోసం కష్టపడుతున్న కంపెనీలకు ఈ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నట్లు వెల్లడైంది. అయితే సర్వేల ప్రకారం త్వరలోనే మరికొంత మంది బ్రిటీష్ వ్యాపాయ యజమానులు ఇదే తరహా పని వ్యవస్థను అవలంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడైంది. నాలుగు రోజుల వారం విధానం ఫలితంగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను వదులుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని డేటా వెల్లడించింది.

తక్కువ సమయంలో ఎక్కువ..

తక్కువ సమయంలో ఎక్కువ..

ట్రయల్ సమయంలో ఉద్యోగ నిలుపుదల, రిక్రూట్‌మెంట్ మెరుగుపడిందని సిటిజన్స్ అడ్వైస్ గేట్స్‌హెడ్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పాల్ ఆలివర్ వెల్లడించారు. దీనికి తోడు సిబ్బంది తక్కువ సమయంలో ఎక్కువ పని చేస్తున్నారని గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. ట్రయల్ ప్రజలు ఎలా పని చేస్తారనే దానిపై పెరుగుతున్న పరిశీలనను ప్రతిబింబిస్తుంది. అయితే పెద్ద వ్యాపార సంస్థలు ఇలాంటి పని విధానంపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ట్రైల్ లో పాల్గొన్నవారిలో దాదాపు 66 శాతం మంది 25 లేదా అంత కంటే ఎక్కువమంది ఉద్యోగుల సంఖ్యను కలిగి ఉన్నారని తెలిసింది.

భారతదేశంలో..

భారతదేశంలో..

ఇండియాలో ప్రస్తుతం ఐటీ రంగంలోని ఉద్యోగులు వారానికి రెండు రోజుల సెలవులను పొందుతున్నారు. ఇతర రంగాల్లో చాలా తక్కువ కంపెనీలు మాత్రమే వారానికి రెండు రోజులు సెలవు ఇస్తున్నాయి. అయితే వారానికి కేవలం నాలుగు రోజులు పని వేళలను ఇండియాలో కూడా ప్రవేశపెట్టాలని డిమాండ్ పెరుగుతోంది. అయితే ఇక్కడి వ్యాపార సంస్థలు ఇలాంటి పని పద్ధతికి అంగీకరించకపోవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Read more about: britan uk business news
English summary

వారానికి నాలుగు రోజులే ఆఫీసులు.. అక్కడ ట్రైల్ విజయవంతం.. OK చెప్పిన కంపెనీలు.. | Four days a week Work Trail successful in UK, Many Britan Employers interested in it

Four days a week Work Trail successful in UK, Many Britan Employers interested in it
Story first published: Wednesday, February 22, 2023, 10:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X