For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..

|

nri taxes: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌ లో వేతన జీవులకు ప్రభుత్వం కొంత ఉపశమనం కల్పిచింది. NRIల పన్ను విధానంలో పెద్దగా మార్పులు లేనప్పటికీ, భారత్‌ లో పెట్టే కొన్ని పెట్టుబడులపై లాభాలు పెంచుకునే అవకాశం ఉంది. NRIల కోసం పన్నుల విధానాన్ని సరళీకృతం చేయడంపై ప్రభుత్వం క్రమంగా దృష్టి పెడుతున్నట్లు అర్థమవుతోంది.

పెద్దగా ఉపయోగం లేదు..
"ఇది దేశానికి మంచి బడ్జెట్. ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడంపై ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించింది. NRIల కోసం మరిన్ని ఉపశమనాలను ఆశించాను కానీ పెద్దగా ఏమీ కనిపించలేదు. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే ఆదాయం మీద డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ (DTAA) ప్రయోజనాలపై స్పష్టత ఇవ్వడం నాకు నచ్చిన అంశాలలో ఒకటి.

తద్వారా NRIలు పన్ను రెసిడెన్సీ సర్టిఫికేట్ (TRC) కోసం దరఖాస్తు చేసుకుని వెంటనే ప్రయోజనం పొందవచ్చు" అని దుబాయ్‌ కి చెందిన 'ది టాక్స్ ఎక్స్‌పర్ట్స్ DMCC' మేనేజింగ్ డైరెక్టర్ దీక్షిత్ జైన్ అభిప్రాయపడ్డారు.

ఈ బడ్జెట్‌లో చేసిన మార్పుల నుంచి NRIలు ఈ 4 విధాలుగా ప్రయోజనం పొందనున్నట్లు ఆయన తెలిపారు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయంపై డబుల్ పన్ను ప్రయోజనాలు

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయంపై డబుల్ పన్ను ప్రయోజనాలు

సాధారణంగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయంపై NRIలు 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు టాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ (TRC) తీసుకోవడం వల్ల ఈ తరహా ఆదాయంపై పన్ను తగ్గుతుందని జైన్ తెలిపారు. ఏప్రిల్ 1, 2023 నుంచి ఈ విధానం అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు.

RNOR హోదా కలిగిన NRIలకు బహుమతుల సదుపాయాన్ని పెంచడం

RNOR హోదా కలిగిన NRIలకు బహుమతుల సదుపాయాన్ని పెంచడం

బంధువులు కాని వారి నుంచి 50 వేల కంటే ఎక్కువ నగదు బహుమతులను NRIలు స్వీకరిస్తే.. వాటిపై 2019 నుంచి పన్ను చెల్లించాల్సి ఉంది. ఈ బడ్జెట్‌లో 'రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్' (RNOR) హోదా ఉన్నవారు కూడా ఈ నిబంధనలో భాగమయ్యారు. ఏప్రిల్ 1, 2024 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని తెలిపారు. RNOR అంటే మొత్తం 10లో 9 ఆర్థిక సంవత్సరాల్లో NRIగా ఉన్న వ్యక్తులు.

ఆఫ్‌షోర్ డెరివేటివ్ ఇన్‌స్ట్రుమెంట్స్ (ODI) బదిలీపై NRIలకు ఆదాయ పన్ను మినహాయింపు

ఆఫ్‌షోర్ డెరివేటివ్ ఇన్‌స్ట్రుమెంట్స్ (ODI) బదిలీపై NRIలకు ఆదాయ పన్ను మినహాయింపు

ఆఫ్‌ షోర్ డెరివేటివ్ ఇన్‌ స్ట్రుమెంట్స్(ODI)లో పెట్టుబడులపై IFSC బ్యాంకింగ్ యూనిట్ (IBU) సంపాదించిన ఆదాయం మీద.. సెక్షన్ 115AD కింద మూలధన లాభాలు, వడ్డీ, డివిడెండ్‌ కింద పన్ను విధించబడుతుంది. ఈ ఆదాయంపై రెండుసార్లు పన్ను విధించబడుతుంది. అంటే మొదట IBU ద్వారా స్వీకరించబడినప్పుడు, రెండవసారి ఆదాయాన్ని నాన్-రెసిడెంట్ ODI హోల్డర్‌లకు పంపిణీ చేసినప్పుడు. ఇకనుంచి ఈ ద్వంద్వ పన్ను నియమాన్ని సవరించాలని ప్రతిపాదించబడింది.

బిజినెస్ ట్రస్టుల ద్వారా వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపులో 5 శాతం తగ్గుదల

బిజినెస్ ట్రస్టుల ద్వారా వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపులో 5 శాతం తగ్గుదల

ఇప్పటి వరకు వ్యాపార ట్రస్ట్ ద్వారా ఒక NRI పెట్టుబడి పెట్టినప్పుడు, నాన్-రెసిడెంట్ ఇన్వెస్టర్ల ఆదాయంపై వచ్చే వడ్డీ మీద 5 శాతం పన్నును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తక్కువ మినహాయింపు కోసం సర్టిఫికేట్ పొందే అవకాశం లేకపోవడంతో మినహాయింపు ప్రయోజనం కోల్పోవాల్సి వచ్చేది. ఈ ఇబ్బందిని తొలగించడానికి సర్టిఫికేట్‌కు అర్హత కలిగి ఉండాలనే నిబంధనను సవరించాలని ప్రతిపాదించబడింది. ఇది ఏప్రిల్ 1, 2023 నుండి అమలులోకి వస్తుంది.

English summary

nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు.. | Four benefits for NRIs through the latest budget

Budget benefits for NRIs
Story first published: Thursday, February 2, 2023, 20:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X