For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రికార్డ్ స్థాయికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు

|

ముంబై: విదేశీ మారకద్రవ్య నిల్వలు రికార్డ్ స్థాయికి చేరుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. డిసెంబర్ 3వ తేదీ నాటికి ఇవి 451 బిలియన్ డాలర్ల కంటే పైకి చేరినట్లు గురువారం తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 38.8 బిలియన్ డాలర్లను అదనంగా సమకూర్చుకున్నట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో ఇది అత్యధికమన్నారు.

ఫారెక్స్‌ రిజర్వ్‌లు అక్షరాలా 451.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 38.8 బిలియన్ డాలర్ల మేర పెరిగినట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు. నవంబర్ 22తో ముగిసిన వారంలో రిజర్వ్‌లు మరో 347 మిలియన్ డాలర్లు పెరిగి 448.596 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

Forex Reserves Cross $450-Billion Mark For First Time

గత కొన్ని నెలలుగా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న నిల్వలు తొలిసారిగా 450 బిలియన్‌ డాలర్లు దాటాయని తెలిపారు. మరోవైపు, బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థలకు ప్రధాన బ్యాంకులు రుణాలు ఇవ్వాండని శక్తికాంత దాస్ సూచించారు. ఆర్థిక సంక్షోభంతో మూతపడిన DHFL దివాలా ప్రకటించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

English summary

రికార్డ్ స్థాయికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు | Forex Reserves Cross $450-Billion Mark For First Time

The country’s foreign exchange reserves crossed the $450-billion mark for the first time ever on the back of strong inflows which enabled the central bank to buy dollars from the market, thus checking any sharp appreciation of the rupee.
Story first published: Friday, December 6, 2019, 10:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X