For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Forex: భారత్ వద్ద మళ్లీ తరిగిపోతున్న ఫారెక్స్ నిల్వలు.. బంగారం కూడా.. నిపుణులు ఏమంటున్నారంటే

|

Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. భారత్ వద్ద కరెన్సీ నిల్వలు తగ్గడం ఇది వరుసగా మూడో వారంగా ఉంది. అంతకుముందు ఇవి రెండు వారాల క్రితమే పెరిగింది. అంతకు ముందు వరుసగా 10 వారాల పాటు తగ్గాయి.

5.87 బిలియన్ డాలర్ల మేర తగ్గిన నిల్వలు..

5.87 బిలియన్ డాలర్ల మేర తగ్గిన నిల్వలు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గణాంకాల ప్రకారం.. జూన్ 17తో ముగిసిన వారంలో భారత విదేశీ మారక నిల్వలు 5.87 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. దీంతో ఇప్పుడు ఫారెక్స్ నిల్వలు 590.588 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఫారెక్స్ నిల్వలు అంతకుముందు జూన్ 10, 2022తో ముగిసిన వారానికి 4.599 బిలియన్ డాలర్లు తగ్గి 596.458 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇప్పుడు వరుసగా మూడోవారం కూడా రిజర్వు బ్యాంక్ వద్ద ఈ నిల్వలు తగ్గాయని తాజా నివేదిక ప్రకారం తెలుస్తోంది.

గతంలోనూ వరుస పతనం..

గతంలోనూ వరుస పతనం..

మే 20కి ముందు కూడా వరుసగా 10 వారాల పాటు భారత్ వద్ద విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయి. ప్రస్తుతం మన దేశం వద్ద విదేశీ మారక నిల్వలు ఒక నెల కంటే ఎక్కువ కాలంగా 600 బిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉన్నాయి. RBI రిపోర్ట్ ప్రకారం.. మే 27 నాటి వారంలో దేశ విదేశీ మారక నిల్వలు 3.854 బిలియన్ డాలర్లు పెరిగి 601.363 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

విదేశీ కరెన్సీ ఆస్తుల్లో క్షీణత..

విదేశీ కరెన్సీ ఆస్తుల్లో క్షీణత..

జూన్ 10తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు తగ్గడానికి కారణం విదేశీ కరెన్సీ ఆస్తులు లేదా విదేశీ కరెన్సీ పడిపోవడమేనని తెలుస్తోంది. ఇది మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో ముఖ్యమైన భాగం. ప్రస్తుతం కరెన్సీ మారక నిల్వలు 5.362 బిలియన్ డాలర్లు తగ్గి 526.882 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. డాలర్లలో తెలిపిన విదేశీ మారక నిల్వల్లో ఉన్న విదేశీ కరెన్సీ ఆస్తులు, యూరో, పౌండ్, యెన్ వంటి ఇతర దేశాల కరెన్సీలు కూడా ఉంటాయి. వీటి విలువల్లో పెరుగుదల లేదా తరుగుదల కూడా విదేశీ మారక నిల్వలపై పడుతుంది.

 భారత్ వద్ద బంగారం నిల్వలు కూడా తగ్గాయి..

భారత్ వద్ద బంగారం నిల్వలు కూడా తగ్గాయి..

రిజర్వ్ బ్యాంక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సమీక్షలో ఉన్న వారంలో బంగారం నిల్వలు విలువ కూడా 258 మిలియన్ డాలర్లు తగ్గి 40,584 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇదే సమయంలో IMF వద్ద ఉన్న దేశ కరెన్సీ నిల్వలు కూడా 17 మిలియన్ డాలర్లు తగ్గి 4968 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ మదుపరులు వరుసగా మన దేశం నుంచి తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోవటం, వడ్డీ రేట్లు పెరగటం వంటి అనేక కారణాలు డాలర్ ను బలపరుస్తున్నాయి. దీంతో రూపాయి విలువ పతనం అవుతోంది. ఈ కారణంగా దిగుమతులకు చేస్తున్న చెల్లింపుల వల్ల మారక నిల్వలు త్వరగా కరిగిపోతున్నాయని నిపుణులు అంటున్నారు.

English summary

Forex: భారత్ వద్ద మళ్లీ తరిగిపోతున్న ఫారెక్స్ నిల్వలు.. బంగారం కూడా.. నిపుణులు ఏమంటున్నారంటే | forex reserves and gold reserves falling with india as per latest rbi reports

forex reserves started falling again with india rbi said
Story first published: Saturday, June 25, 2022, 14:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X